- Telugu News Photo Gallery Cinema photos Tollywood directors are creating imaginery places for pan india movies
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమా స్పాన్‌తో పాటు స్కేల్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు లార్జన్‌దాన్ లైఫ్ అన్న రేంజ్‌లో సినిమా కథలు ఉండేవి. కానీ ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతకు మించి ఉంటున్నాయి. అందుకే రియల్ వరల్డ్‌లో సాధ్యం కాని అలాంటి విషయాలను తెర మీద చూపించేందుకు ఇమాజినరీ ప్లేసెస్‌ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ టైమ్స్‌లో సూపర్ పాపులర్ అయిన ఇమాజినరీ వరల్డ్ ఎర్రసముద్ర తీరం.
Updated on: Nov 15, 2024 | 9:03 PM

పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమా స్పాన్‌తో పాటు స్కేల్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు లార్జన్‌దాన్ లైఫ్ అన్న రేంజ్‌లో సినిమా కథలు ఉండేవి. కానీ ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతకు మించి ఉంటున్నాయి. అందుకే రియల్ వరల్డ్‌లో సాధ్యం కాని అలాంటి విషయాలను తెర మీద చూపించేందుకు ఇమాజినరీ ప్లేసెస్‌ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

రీసెంట్ టైమ్స్‌లో సూపర్ పాపులర్ అయిన ఇమాజినరీ వరల్డ్ ఎర్రసముద్ర తీరం. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దేవర సినిమా కథ అంతా ఈ ఎర్ర సముద్రం తీరంలోనే జరుగుతోంది. అక్కడి గ్రామాలు, ఆ ప్రాంతంలో ఉండే మనుషులు ఇలా ప్రతీ విషయాన్ని కొత్తగా క్రియేట్ చేశారు దేవర మేకర్స్.

ఈ వారం విడుదలైన కంగువా కోసం కూడా ఇలాంటి ఓ కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేశారు మేకర్స్. 200 ఏళ్ల క్రితం గిరిజనుల జీవన విధానానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు మేకర్స్.

రీసెంట్ టైమ్స్‌లో సూపర్ పాపులర్ అయిన మరో ఇమాజినరీ వరల్డ్ ఖాన్‌సారా. సలార్ సినిమా అంతా ఈ ప్లేస్ చుట్టూనే తిరుగుతుంది. గతంలో కేజీఎఫ్ కోసం నారాచీ అనే క్రూయల్ వరల్డ్‌ని క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, సలార్ కోసం అంతకు మించిన వైలెంట్ వరల్డ్‌ను సెట్ చేశారు. సలార్ రిలీజ్ తరువాత సూపర్ పాపులర్ అయిన ఖాన్‌సారా గురించి, అక్కడి జనాలు, తెగల గురించి సపరేట్ ప్రోమోస్ చేశారంటేనే ఈ ఇమాజినరీ వరల్డ్ ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

అందుకే కల్కి కోసం ఏకంగా ఖండాలు దాటేస్తున్నారు. దేశం కాని దేశానికి టీం అంతా కలిసి వెళ్తున్నారు. తెలుగు హీరోలు కేవలం టాలీవుడ్‌కు మాత్రమే సొంతం కాదు. సౌత్ టూ నార్త్ మనోళ్లదే హవా.




