Basha Shek |
Dec 03, 2024 | 9:28 PM
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 05న విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
2021లో విడుదలైన 'పుష్ప' చిత్రానికి ‘పుష్ప 2’ వస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత పుష్ప 3’ కూడా రానుందని వార్తలొస్తున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన కొందరు చేస్తున్న పోస్టులు దీనికి బలం చేకూరుస్తున్నాయి.
ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ 'పుష్ప1, పుష్ప 2 సినిమాలో విలన్‌గా నటించాడు. అయితే పుష్ప 3లో మాత్రం ఒక టాలీవుడ్ క్రేజీ హీరో విలన్ గా కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది.
తన సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, వాటికి పవర్ ఫుల్ నటీనటులను ఎంచుకోవడం దర్శకుడు సుకుమార్ స్టయిల్.
ఈ క్రమంలోనే 'పుష్ప 3' సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోను విలన్‌గా ఎంచుకున్నారని తెలుస్తోంది.