- Telugu News Photo Gallery Cinema photos These are the 5 best Telugu movies that turned Samantha life around
సమంత జీవితాన్నే మార్చేసిన బెస్ట్ 5 మూవీస్ ఇవే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ అమ్మడు స్టార్ హీరోల రేంజ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా, స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని, టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అమ్మడుకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ లైఫ్ ఛేంజ్ చేసిన బెస్ట్ మూవీస్ ఏవో చూద్దాం.
Updated on: Dec 04, 2025 | 1:57 PM

సమంత మొదటి సినిమా ఏమాయ చేశావే. నాగచైతన్య సరసన హీరోయిన్‌గా సమంత ఏమాయ చేసావే సినిమాలో నటించింది. ఇక ఈ మూవీలో ఈ కపుల్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా, సమంత నటన, జెస్సీ పాత్రలో ఈ బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందరి దృష్టి సమంతపైనే పడింది. ఈ మూవీ తర్వాత సమంతకు అవకాశాలు క్యూ కట్టాయనే చెప్పాలి. అలా సమంత జీవితంలో బెస్ట్ సినిమాల్లో ఇదొక్కటి.

అదే విధంగా సుకుమార్ దర్శకత్వంలో, రామ్ చరణ్ సరసన సమంత నటించిన మూవీ రంగస్థలం. ఈ మూవీలో సమంత తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అచ్చం పల్లెటూరి పిల్లలా నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ ఈ బ్యూటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ సమంతను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసిందనే చెప్పాలి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సమంత మహేష్ బాబు సరసన నటించి మెప్పించింది. చాలా క్యూట్‌గా కనిపిస్తూ, అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా వీరి కాంబోలో వచ్చిన దూకుడు మూవీ కూడా సమంత కెరీర్‌లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు.

ఓబేబీ మూవీలో సమంత నటనకు ఎన్నో అవార్డ్స్ దక్కాయి. ఈ బ్యూటీకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాల్లో ఓబేబీ కూడా ఒకటి. ఈ మూవీలో సమంత తన నటనతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. అలాగే అక్కినేని ఫ్యామిలీ మూవీ మనం సినిమాలో సమంత, నాగచైతన్యకు జోడిగా నటించిన విషయం తెలిసిందే. సమంత కెరీర్‌లో మనం కూడా బెస్ట్ మూవీ.

కెరీర్ ప్రారంభంలోనే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాన్ సరసన , త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అత్తారింటికి దారేది. ఈ సినిమాతో సమంత ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత సమంతకు అవకాశాలు క్యూ కట్టాయి. దీని తర్వాత వరసగా చాలా సినిమాల్లో నటించి, సూపర్ హిట్స్ అందుకుంది.



