
సెకండాఫ్ ఎలా ఉండబోతుందనేది ఇండస్ట్రీ ఫ్యూచర్ డిసైడ్ చేయనుంది. ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కల్కి పోస్టుపోన్ అయితే ఇదే రోజు ఫ్రెండ్స్ ఇద్దరు పోటీ పడేలా కనిపిస్తున్నారు.

నెల రోజుల గ్యాప్‌లో సెప్టెంబర్ 27న ఓజితో పవన్ కళ్యాణ్ రానున్నారు. అత్తారింటికి దారేది విడుదలైన 11 ఏళ్ళ తర్వాత అదే తేదీన మళ్లీ రానున్నారు పవర్ స్టార్. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. పవన్ సరసన శ్రీలీల నటిస్తుంది. దీనిపైనే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ.

అలాగే జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దేవర 1 అక్టోబర్ 10న దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీనిపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

తండేల్ సినిమా కూడా అక్టోబర్ లోని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. దసరా రేసులో తారక్, చైతూతో పాటు బాలయ్య కూడా ఉన్నారని తెలుస్తుంది. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా దసరాకే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక డిసెంబర్ 25న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ రూపంలో క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్. ఈ చిత్రంలో చెర్రీకి జోడిగా కియారా అద్వానీ నటిస్తున్నాడు. నటి అంజలి కీలక పాత్రల్లో కనిపించనుంది. వీటి ఫలితాలే టాలీవుడ్ ఫ్యూచర్‌ను నిర్ణయించబోతున్నాయి.