
సీనియర్ హీరోయిన్లంతా నెమ్మదిగా ఫోకస్‌ను సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీలకు షిఫ్ట్ చేస్తుంటే, మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం తన ఫోకస్‌ను హోం గ్రౌండ్ టాలీవుడ్ నుంచి అదర్ లాంగ్వేజెస్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. ఇక కెరీర్ క్లైమాక్స్‌కు వచ్చేసినట్టే అనుకుంటున్న టైమ్‌లో ఇప్పుడు కొత్త గ్రౌండ్‌లో గేమ్ స్టార్ట్ చేశారు.

నువ్ కావాలయ్య అంటూ ఈ మధ్యే సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన హాట్ బ్యూటీ తమన్నా, తాజాగా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పద్దెనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా... ఇన్నాళ్లు ఒక్క మలయాళ సినిమా కూడా చేయలేదు మిల్కీ. ఈ ఏడాదే బాంద్రా సినిమాతో మాలీవుడ్ అరంగేట్రం చేశారు.

మాలీవుడ్ టాప్ స్టార్ దిలీప్ హీరోగా తెరకెక్కిన బాంద్రా సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో మాలీవుడ్‌లో తమన్నా ఎంట్రీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విషయంలో ముందు నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తుండటంతో తమన్నా డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మాలీవుడ్ మేకర్స్.

మాలీవుడ్‌లో తమన్నా ఎంట్రీ అక్కడి హీరోయిన్స్‌కు ఇబ్బంది కరంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. తమన్నా లీడ్ రోల్ ప్లే చేసే సినిమాలో నటించేందుకు మలయాళ బ్యూటీస్ ఇంట్రస్ట్ చూపించటం లేదట.

తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకుంటే తాము తేలిపోతామని భయపడుతున్నారట మలబారు తారలు. దీంతో తమన్నా ఎంట్రీని అపోజ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ప్రెజర్‌ను తమ్ము ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.