- Telugu News Photo Gallery Cinema photos Sudheer babu is coming with pan india movie with bollywood producer
Sudheer Babu: ఈ ప్రాజెక్ట్‌కు చాలా ప్రత్యేకతలు.. సుధీర్ బాబు ఏం చేయబోతున్నారు ??
హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరస సినిమాలు చేస్తుంటారు.. అందులో సుధీర్ బాబు ముందుంటారు. మొన్నటికి మొన్న హరోం హరతో వచ్చిన ఈయన.. తాజాగా ఓ సెన్సేషనల్ పాన్ ఇండియన్ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. మరి అవేంటి..? ఇంతకీ సుధీర్ బాబు నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..? ఫలితంతో సంబంధం లేకుండా డిఫెరెంట్ సబ్జెక్టులు ఎంచుకునే హీరోలలో సుధీర్ బాబు కూడా ఒకరు.
Updated on: Jul 03, 2024 | 3:12 PM

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరస సినిమాలు చేస్తుంటారు.. అందులో సుధీర్ బాబు ముందుంటారు. మొన్నటికి మొన్న హరోం హరతో వచ్చిన ఈయన.. తాజాగా ఓ సెన్సేషనల్ పాన్ ఇండియన్ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. మరి అవేంటి..? ఇంతకీ సుధీర్ బాబు నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..?

ఫలితంతో సంబంధం లేకుండా డిఫెరెంట్ సబ్జెక్టులు ఎంచుకునే హీరోలలో సుధీర్ బాబు కూడా ఒకరు. గతేడాది హంట్, మామా మశ్చీంద్ర అనే ప్రయోగాత్మక సినిమాలు చేసారు.. మొన్నామధ్య హరోం హర అంటూ వచ్చారు.

వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నా.. నటుడిగా మాత్రం సుధీర్ బాబుకు మంచి పేరు వచ్చింది. తాజాగా ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌కు సిద్ధమవుతున్నారు సుధీర్. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాకు సిద్ధమవుతున్నారు సుధీర్ బాబు.

సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకుడు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రుస్తుం, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేర్నా అరోరా ఓ లీడింగ్ స్టూడియోతో కలిసి సుధీర్ బాబు సినిమాను నిర్మించబోతున్నారు. సుధీర్ బాబుకు బాలీవుడ్‌లోనూ గుర్తింపు ఉంది.

ఆ మధ్య టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన భాగీలో విలన్‌గా నటించారు సుధీర్. వర్షం సినిమాకు రీమేక్‌గా వచ్చిన భాగీలో గోపీచంద్ పాత్రలో నటించారు. ఆ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా అటువైపు వెళ్లలేదు సుధీర్. ఇన్నాళ్లకు మళ్ళీ తెలుగుతో పాటు హిందీపైనా ఫోకస్ చేసారు. మొత్తానికి చూడాలిక.. సుధీర్ బాబు కెరీర్‌కు ఈ సినిమా ఏ మేరకు బ్రేక్ ఇవ్వబోతుందో..?




