నో అప్డేట్ అయినా ట్రెండింగ్..జోష్ పెంచుతున్న మహేష్ బాబు,జక్కన్న!
అఫీషియల్ అప్‌డేట్ ఒక్కటి కూడా లేకపోయినా... సోషల్ మీడియాలో మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కాంబినేషన్స్, కాస్టింగ్‌కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి గ్లోబల్ రేంజ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది మహేష్ మూవీ.
Updated on: Jan 24, 2025 | 2:46 PM

ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఈ మధ్యే మహేష్ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ కాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి.

గ్లోబల్ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటించబోతున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పీసీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించటంతో మహేష్ మూవీ కోసమే వచ్చారంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న అడ్వంచరస్ యాక్షన్ డ్రామాగా మహేష్ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆల్రెడీ ట్రిపులార్‌తో గ్లోబల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నారు జక్కన్న.

రాజమౌళి, మహేష్ మూవీని గ్లోబల్ రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా సినిమాను రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు.





























