- Telugu News Photo Gallery Cinema photos Singer Vani Jayaram Super Hit Songs in Telugu know here telugu cinema news
Singer Vani Jayaram: ఆమె ఓ స్వరరాగ మాధుర్యం.. దొరకునా ఇటువంటి గానం.. పాటల ప్రపంచంలో చెరగని ముద్ర..
కళాతపస్వి కే విశ్వనాథ్ మరణం నుంచి ఇంకా కోలుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈమె మరణవార్త తెలిసి సంగీత అభిమానులు విషాదంలోకి వెళ్లిపోయారు. తెలుగు, తమిళం సహా 14 భాషల్లో 20 వేల వరకు పాటలు పాడిన వాణి జయరామ్.. సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసారు.
Updated on: Feb 04, 2023 | 4:57 PM

కళాతపస్వి కే విశ్వనాథ్ మరణం నుంచి ఇంకా కోలుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈమె మరణవార్త తెలిసి సంగీత అభిమానులు విషాదంలోకి వెళ్లిపోయారు. తెలుగు, తమిళం సహా 14 భాషల్లో 20 వేల వరకు పాటలు పాడిన వాణి జయరామ్.. సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసారు.

వాణి జయరామ్.. ఈ పేరు తెలియని సంగీత ప్రియుడు ఉండరేమో..? తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రంతో ప్రాణ ప్రతిష్ట చేసారు వాణి. ఒకటి రెండు కాదు 20 వేలకు పైగా ఎన్నో భాషల్లో పాటలు పాడారు ఈ లెజెండరీ సింగర్.

చిన్నప్పటి నుంచే వాణి జయరామ్‌కు సంగీతంపై మంచి పట్టుంది. 8వ ఏటనే సంగీత కచేరి నిర్వహించిన వాణి.. ముత్తస్వామి దీక్షితుల కీర్తనల ఆలాపనలో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాటలోని భావాన్ని చక్కగా అర్థం చేసుకున్న తర్వాతే ఆమె ఆలపిస్తారు.. తమిళనాడు సొంత రాష్ట్రమైనా.. ఆమె కర్నూలులో పుట్టి పెరిగారు. అందుకే తెలుగుపై పట్టు సాధించారు.

ఉత్తమ గాయనిగా కెరీర్‌లో మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు వాణి. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగాళ్' సినిమాలోని పాటలకు గానూ ఈమె మొదటి సారి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇదే సినిమా తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చింది.

ఆ తర్వాత రెండు జాతీయ అవార్డులు కె. విశ్వనాథ్ సినిమాల్లో పాటలకు అందుకున్నారు వాణి. శంకరాభరణం సినిమాలో ఈమె పాడిన పాటలకు మంచి ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా మానస సంచరణే చాలా పెద్ద హిట్ అయింది. అలాగే స్వాతికిరణంలో ఆనతినీయరా హర పాటకు మరోసారి జాతీయ అవార్డు అందుకున్నారు వాణి.

కళాతపస్వి కే విశ్వనాథ్ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు వాణి. ఆయన మరణించిన రెండు రోజులకే ఈమె కూడా కన్నుమూయడం సంగీత ప్రియులను విషాదంలోకి నెట్టేసింది. 'గుడ్డీ' అనే హిందీ సినిమాతో పరిచయమైన వాణీ జయరామ్.. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి, ఒరియా, తుళు భాషల్లో పాటలు పాడారు. 50 ఏళ్ల కెరీర్‌లో 10 వేల పాటలకు పైగా పాడారు.

తెలుగులో వాణి జయరామ్ పాడిన సినిమాల్లో 'మరో చరిత్ర', 'శంకరాభరణం', 'సీతాకోక చిలుక', 'శ్రుతి లయలు', 'స్వర్ణ కమలం', 'స్వాతి కిరణం', 'ప్రేమాలయం' లాంటివి ప్రముఖంగా చెప్పొచ్చు.

ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్, ఇళయరాజా, ఆర్.డి. బర్మన్, ఓపీ నయ్యర్, మోహన్ మోహన్, ఇళయ రాజా సహా చాలా మంది దిగ్గజ సంగీత దర్శకుల సారథ్యంలో వాణీ జయరామ్ పాడారు

ఆమె ఓ స్వరరాగ మాధుర్యం.. దొరకునా ఇటువంటి గానం.. పాటల ప్రపంచంలో చెరగని ముద్ర..




