- Telugu News Photo Gallery Cinema photos Senior actress raasi about rejecting balakrishna samarasimha reddy movie offer
Raasi: అందుకే బాలయ్య సినిమాలో నటించలేదట.. ఆసక్తికర విషయం బయట పెట్టిన హీరోయిన్ రాశి
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో అందాల తార రాశి ఒకరు. వచ్చిన తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లు అందుకొని దూసుకుపోయింది రాశి.
Updated on: Jan 15, 2022 | 9:05 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో అందాల తార రాశి ఒకరు. వచ్చిన తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లు అందుకొని దూసుకుపోయింది రాశి.

రాశి దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకున్నారు. అప్పట్లో రాశి నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.

అయితే ఓ స్టార్ హీరో సినిమాలో నటించడానికి మాత్రం రాశి నో చెప్పరటా..

ఆ స్టార్ హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. 'సమర సింహారెడ్డి’ సినిమాలో ముందుగా రాశికి అవకాశం వచ్చిందట.

సిమ్రన్ పాత్రలో రాశిని సంప్రదించారట దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా దర్శకుడు బి . గోపాల్ఆ మెను సంప్రదించి కథ కూడా పూర్తిగా వివరించాడట.

అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశం నచ్చకపోవడంతో రాశి బాలయ్య సినిమాను వదులుకుంది.

అదేంటంటే.. ఇందులో సీతాకోకచిలుకతో హీరోయిన్ సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే ఈ సీన్ చేయడానికి రాశి ససేమిరా అందట

అలా ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నారు రాశి. కాగా అదే ఏడాది ‘కృష్ణ బాబు’ చిత్రంలో బాలయ్యతో కలిసి నటించింది రాశి




