- Telugu News Photo Gallery Cinema photos Sankranthiki Vasthunnam actress Aishwarya Rajesh shared her latest pics
Aishwarya Rajesh: రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం.. కిర్రెక్కిపోతున్న ఫ్యాన్స్
తమిళ్ నటుడు దినేష్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అట్టకత్తి' సినిమాలో చిన్న పాత్రతో నటిగా తెరంగేట్రం చేసింది ఐశ్వర్య రాజేష్. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది.అట్టకత్తి సినిమాలో ఈ అమ్మడి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Updated on: Feb 08, 2025 | 9:33 PM

సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఐశ్వర్య రాజేష్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు మొదట్లో తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తమిళ్ నటుడు దినేష్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అట్టకత్తి' సినిమాలో చిన్న పాత్రతో నటిగా తెరంగేట్రం చేసింది ఐశ్వర్య రాజేష్. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది.అట్టకత్తి సినిమాలో ఈ అమ్మడి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలుగులో ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఐశ్వర్యకు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే ముందు ఐశ్వర్య రాజేష్ కొన్ని సినిమాల్లో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్,టక్ జగదీష్,రిపబ్లిక్ సినిమాల్లో నటించింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ కు ఇప్పుడు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయని తెలుస్తుంది. తాజాగా ఐశ్వర్య రాజేష్ కు ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.





























