- Telugu News Photo Gallery Cinema photos Sandeep Reddy Vanga rejcted for deepika padukone keep high conditions
Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్న సందీప్ యాటిట్యూడ్
బాలీవుడ్‌కు వరుస షాకిలిస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. చేసింది మూడు సినిమాలే అందులోనూ ఒకటి రీమేకే అయినా... సందీప్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా సందీప్ యాటిట్యూడ్‌కే సపరేట్ ఫ్యాన్స్ బేస్. అలాంటి తన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తున్నారు ఈ డేరింగ్ డైరెక్టర్.. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా..? ఆ డిటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: May 24, 2025 | 3:09 PM

అర్జున్ రెడ్డి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆ సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి నార్త్ ఇండస్ట్రీలోనూ అదే రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ముఖ్యంగా రివ్యూవర్ల విషయంలో సందీప్ చేసిన కామెంట్స్, బాలీవుడ్‌కి షాక్ ఇచ్చాయి. యానిమల్ సినిమా విషయంలోనూ తన యాటిట్యూడ్‌ను కంటిన్యూ చేశారు సందీప్.

ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిణితి చోప్రాను తీసుకున్నారు. కొద్ది రోజుల షూటింగ్ తరువాత ఆమె ఆ క్యారెక్టర్‌కు సూట్ కాలేదంటూ... స్టార్ కిడ్ అని కూడా చూడకుండా పరిణితిని పక్కన పెట్టి రష్మికకు ఛాన్స్ ఇచ్చారు.

ఇప్పుడు స్పిరిట్ విషయంలో అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు సందీప్. ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికను తీసుకోవాలని భావించినా.. ఆమె పెట్టి డిమాండ్స్‌కు నో చెప్పేశారు.

దీపికను కాదని, డార్లింగ్‌కు జోడీగా కొత్త అమ్మాయిని తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. సందీప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు నార్త్ సర్కిల్స్‌లో హట్ టాపిక్ అవుతున్నాయి.




