- Telugu News Photo Gallery Cinema photos Jr ntr will be the first hero from tollywood if war 2 hit in bollywood
War 2: బాలీవుడ్ లో తారక్ హిట్ కొట్టాడా.. టాలీవుడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసినట్లే
వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ మేకర్స్ కూడా తారక్‌కు గ్రాండ్‌గా వెల్‌కం చెబుతున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... ఓ సెంటిమెంట్ తారక్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఏంటా సెంటిమెంట్ అనుకుంటున్నారా.. అయితే ఫాలో దిస్ స్టోరి
Updated on: May 24, 2025 | 2:59 PM

ఈ జనరేషన్‌లో తెలుగు హీరోలకు బాలీవుడ్ మూవీస్ పెద్దగా కలిసి రాలేదు. మన సినిమాలతో బాలీవుడ్ మార్కెట్‌ను రూల్ చేసిన హీరోలు కూడా స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ విషయంలో తడబడ్డారు.

ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ప్రభాస్, ఆది పురుష్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే బాలీవుడ్ మూవీ చేయాలన్న ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కొన్నారు మెగా వారసుడు రామ్ చరణ్.

జంజీర్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చిన చరణ్‌కు భారీ షాక్ తగిలింది. దీంతో బాలీవుడ్‌లో కెరీర్ కంటిన్యూ చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నారు చెర్రీ. రీసెంట్‌గా యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇదే పొరపాటు చేశారు.

తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు సాయి. ఈ సినిమా కూడా నార్త్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో తెలుగు హీరోలు బాలీవుడ్‌లో స్ట్రయిట్ సినిమాలు చేసి మెప్పించటం కష్టమన్న నిర్ణయానికి వచ్చేశారు ప్రేక్షకులు.

ఇప్పుడు తారక్ కూడా స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బాలీవుడ్ సెంటిమెంట్ తారక్‌ను కూడా ఇబ్బంది పెడుతుందేమో అని భయపడుతున్నారు. మరి జూనియర్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా...? బాలీవుడ్ డెబ్యూలో సత్తా చాటుతారా.. లెట్స్ వెయిట్ అండ్ సీ.




