- Telugu News Photo Gallery Cinema photos Sai Pallavi is taking Rs.50 crores remuneration for Bollywood Movie Ramayan
ప్రియాంక చోప్రా, దీపిక కాదు.. ఒక్క సినిమాకు రూ.50కోట్లు అందుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్..
హీరోయిన్స్ ఈ మధ్య హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. మాములుగా ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న హీరోయిన్స్ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్స్ బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె..
Updated on: Aug 17, 2024 | 2:27 PM

హీరోయిన్స్ ఈ మధ్య హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. మాములుగా ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న హీరోయిన్స్ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్స్ బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె..

అలాగే సౌత్ హీరోయిన్స్ విషయానికొస్తే నయనతార, త్రిషలాంటి హీరోయిన్స్ ఎక్కువ రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఓ తెలుగు హీరోయిన్ ఒక్క సినిమాకు రూ. 50కోట్లు రెమ్యునరేషన్స్ అందుకుంటుంది.

ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె మరెవరో కాదు సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అంతకు ముందు పలు టీవీ షోల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ చేసింది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.

ఇక తెలుగులో ఫిదా సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. తెలుగు, తమిళ్ భాషలతో పాటు ఇప్పుడు హిందీలోనూ సినిమా చేస్తుంది ఈ చిన్నది. హిందీలో రామాయణం చేస్తుంది.

రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. అలాగే సీతగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాను చాలా పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి నటీనటులకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. సాయి పల్లవి ఈ సినిమా కోసం రూ. 50కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది.




