- Telugu News Photo Gallery Cinema photos Renu desai birthday celebrities sending birthday wishes in social media au24
Happy Birthday Renu Desai: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాన్ ఇండియా మూవీతో మళ్లీ సిల్వర్‌స్ర్కీన్‌పై ‘రేణు దేశాయ్’..బర్త్డే స్పెషల్.
ప్రముఖ నటి ,మోడల్, కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకురాలు..రేణూ దేశాయ్ పుట్టిన రోజు నేడు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ రేణు దేశాయ్ ఈరోజు..
Updated on: Dec 04, 2022 | 3:31 PM

మల్టీ టాలెంటెడ్ పర్సన్ రేణు దేశాయ్ పుట్టిన రోజు స్పెషల్

ప్రముఖ నటి ,మోడల్, కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకురాలు..రేణూ దేశాయ్ పుట్టిన రోజు నేడు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ రేణు దేశాయ్ ఈరోజు 41ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 42వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న రేణు దేశాయ్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

చాలామంది ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో విడాకుల అనంతరం పూణే లో నివసిస్తున్న రేణు దేశాయ్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను బలంగా, వాదనను బలంగా వినిపిస్తారు.

రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రెండు దేశాయ్.. ఇండి పాప్ సాంగ్స్ లో కూడా కనిపించి అలరించింది.

2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు సినిమాతో వెండి తెరపై నటిగా అడుగు పెట్టింది. తెలుగులో పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచామయింది.

బద్రి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

చిన్నతనం నుంచి తాను ఎన్నో కష్టాలను ఓర్చికుని.. తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నానని చెప్పే రేణు దేశాయ్.. ఎక్కడ ఉన్నా ఛాంపియన్ గా నిలవాలని ప్రయత్నిస్తానని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. రైతుల సమస్యల ఆధారంగా తెలుగులో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది.

ఇటీవల బుల్లి తెరమీద పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రేణు దేశాయ్ తెలుగు వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తుందనే టాక్ కూడా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే..

అకిరా నందన్, ఆద్య ఈ దంపతుల పిల్లలు. తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ తన అకిరా, ఆద్యలతో పుణేలో నివసిస్తున్నారు.
