Thaman: అసలేమైంది.. వరుసగా లీక్ అవుతున్న థమన్ పాటలు
అంతేమరి.. కాలం కలిసిరాకపోతే అరిటిపండు తిన్నా పన్ను ఇరుగుద్ది. పాపం ఇప్పుడు థమన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలే ఈ మధ్య మనోడి టైమ్ అంతంతమాత్రంగా ఉంది. ఓ సినిమా ఆడితే.. మూడు నాలుగు పోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో సాంగ్ లీక్స్ థమన్‌ను మరింత కంగారు పెడుతున్నాయి. అసలు థమన్ పాటలు మాత్రమే ఎందుకు లీక్ అవుతున్నాయి..? వరస ఫ్లాప్స్ తర్వాత భగవంత్ కేసరితో ఎలాగోలా ఫామ్‌లోకి వచ్చారు థమన్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 06, 2023 | 9:03 PM

అంతేమరి.. కాలం కలిసిరాకపోతే అరిటిపండు తిన్నా పన్ను ఇరుగుద్ది. పాపం ఇప్పుడు థమన్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలే ఈ మధ్య మనోడి టైమ్ అంతంతమాత్రంగా ఉంది. ఓ సినిమా ఆడితే.. మూడు నాలుగు పోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో సాంగ్ లీక్స్ థమన్‌ను మరింత కంగారు పెడుతున్నాయి. అసలు థమన్ పాటలు మాత్రమే ఎందుకు లీక్ అవుతున్నాయి..?

వరస ఫ్లాప్స్ తర్వాత భగవంత్ కేసరితో ఎలాగోలా ఫామ్‌లోకి వచ్చారు థమన్. ఈ సినిమాలో ఆయన పాటలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అనిల్ రావిపూడి చెప్పినట్లు అదిరిపోయింది. అంతా బాగానే ఉంది కానీ థమన్ మ్యూజిక్ చేస్తున్న సినిమాల నుంచి పాటలు వరసగా లీక్ అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ లీక్ ఇంకా మరవకముందే.. గుంటూరు కారం పాట లీకైందిప్పుడు.

నిజానికి ప్రొడక్షన్‌లో ఉన్న భారీ సినిమాల లీక్స్ వరసగా జరుగుతూనే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ పాట లీక్ అయినపుడు.. దిల్ రాజు టీం స్పందించింది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.

దీనిపైనే చరణ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారంటే.. తాజాగా గుంటూరు కారం నుంచి అంత క్లియర్‌గా లేని ఓ ఆడియో లీక్ అయింది. గతంలో సర్కారు వారి పాటలో కళావతి పాట ఇలాగే లీకైంది. దాంతో ఒరిజినల్ వెంటనే విడుదల చేసారు మేకర్స్.

గతంలో గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఓ పాట ఇలాగే బయటికొచ్చింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల నుంచి ఇలా పాటలు లీక్ అవుతుండటమే ఇప్పుడు అందర్నీ కంగారు పెట్టే విషయం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎలాగోలా లీక్ కావడం అనేది సమస్యగా మారిందిప్పుడు. ఇవన్నీ తమన్ పాటలే కావడం గమనార్హం. ఈ లీక్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇబ్బందులు తప్పట్లేదు.





























