- Telugu News Photo Gallery Cinema photos Raviteja also focused on pan india market from Tiger Nageswara Rao Movies
Ravi Teja: పాన్ ఇండియా వైపుగా టైగర్ నాగేశ్వరరావు.. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు సిద్దమవుతున్న రవితేజ..
నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకుంటుంటే.. ఎప్పట్నుంచో ఉన్న రవితేజకు అది అందుకోవాలని ఉండదా చెప్పండి..? మన తర్వాత వచ్చినవాడు.. రేసులో ముందుకెళ్తుంటే ఎలాగైనా దాటేయాలనే కసైతే ఉంటుంది కదా..! రవితేజలో ఇదే కనిపిస్తుందిప్పుడు. టైగర్ నాగేశ్వరరావుతో అందరి లెక్కలు తేల్చేయాలని ఫిక్సైపోయారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఏడాదికి 3 సినిమాలు చేసామా లేదా అనేది రవితేజ శైలి. మార్కెట్, బిజినెస్ అంటూ పెద్దగా ఆలోచించడం ఈయనకు తెలియదు.. అలవాటు లేదు కూడా.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Oct 04, 2023 | 1:50 PM

నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకుంటుంటే.. ఎప్పట్నుంచో ఉన్న రవితేజకు అది అందుకోవాలని ఉండదా చెప్పండి..? మన తర్వాత వచ్చినవాడు.. రేసులో ముందుకెళ్తుంటే ఎలాగైనా దాటేయాలనే కసైతే ఉంటుంది కదా..! రవితేజలో ఇదే కనిపిస్తుందిప్పుడు. టైగర్ నాగేశ్వరరావుతో అందరి లెక్కలు తేల్చేయాలని ఫిక్సైపోయారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

ఏడాదికి 3 సినిమాలు చేసామా లేదా అనేది రవితేజ శైలి. మార్కెట్, బిజినెస్ అంటూ పెద్దగా ఆలోచించడం ఈయనకు తెలియదు.. అలవాటు లేదు కూడా. కానీ అందరూ మారుతున్నపుడు ఈయన కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అందరి మాదిరే పాన్ ఇండియన్ మార్కెట్‌పై కన్నేసారు మాస్ రాజా. టైగర్ నాగేశ్వరరావుతోనే ఈ పని మొదలు పెడుతున్నారు.. ఇది ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.

రవితేజ జోన్‌లోనే ఉన్న నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఇప్పటికే 50 కోట్ల షేర్ అందుకున్నారు.. వాళ్ల సినిమాలకు 50 కోట్ల బిజినెస్ కూడా జరిగింది. కానీ అంత అనుభవం ఉండి.. బోలెడు మాస్ ఇమేజ్ ఉన్న రవితేజ సినిమాలు మాత్రం ఇప్పటి వరకు 50 కోట్ల షేర్ అందుకోలేదు.. ధమాకా దగ్గరికి వచ్చినా.. 50 కోట్లు చేరుకోలేదు. దాంతో టైగర్ నాగేశ్వరరావుతో లెక్క సరిచేయాలని చూస్తున్నారీయన.

టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా.. వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 50 కోట్ల బిజినెస్ వైపు అడుగులేస్తున్నారు మాస్ రాజా. అందుకే ట్రైలర్ లాంఛ్ ముంబైలో చేసారు మేకర్స్.

తెలుగుతో పాటు హిందీలోనూ రవితేజ సొంత డబ్బింగ్ చెప్పుకున్నారు. అక్టోబర్ 19న లియో, భగవంత్ కేసరి వస్తుంటే.. 20న టైగర్ వేటకు వస్తుంది. మరి చూడాలిక.. ఈ చిత్రంతో మాస్ రాజా ఏం మ్యాజిక్ చేస్తారో..?





























