Rathika Rose: ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ !!
రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు అడుగుపెట్టి తన అందాలతో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే బిగ్ బాస్ కంప్లీట్ అయ్యాక కొంతమందికి మెరుగైన అవకాశలు వచ్చాయి. అలాంటి మెరుగైన అవకాశం పొందిన వారిలో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు. బిగ్ బాస్ నుండి ఆస్కార్ వరకూ ఎదిగాడు. ఈమధ్య సిరి హనుమంత్ మాత్రమే బాలీవుడ్ లో..షారుఖ్ సరసన జవాన్ సినిమాలోనటించే ఛాన్స్ ను దక్కించుకుంది.
Updated on: Apr 20, 2024 | 9:52 PM

రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు అడుగుపెట్టి తన అందాలతో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే బిగ్ బాస్ కంప్లీట్ అయ్యాక కొంతమందికి మెరుగైన అవకాశలు వచ్చాయి.

అలాంటి మెరుగైన అవకాశం పొందిన వారిలో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు. బిగ్ బాస్ నుండి ఆస్కార్ వరకూ ఎదిగాడు. ఈమధ్య సిరి హనుమంత్ మాత్రమే బాలీవుడ్ లో..షారుఖ్ సరసన జవాన్ సినిమాలోనటించే ఛాన్స్ ను దక్కించుకుంది.

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రతిక బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత బాగా పాపులర్ అయ్యింది. మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది. అంతేకాదు బిగ్ బాస్ తరువాత పలు సినిమాలలో కూడా ఆమె అవకాశాలు సాధించుకుంది.

అయితే ఈ ఏడు సీజన్ల బ్యాచ్ లో జాక్ పాట్ కొట్టిన నటీనటులు ఎవరూ లేరు అనే అనాలి. ఇదిలా ఉంటే సిరి హనుమంత్ లాంటి అవకాశమే సాధించింది రతికరోజ్. ఇక తాజాగా ఆమె జాక్ పాట్ ఆఫర్ కొట్టేసింది అన్న వార్త వైరల్ గా మారింది.

ఆమె ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కీలకపాత్రకోసం సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది. సిరీ హనుమంత్ షారుఖ్ సినిమాలో నటిస్తే రతిక రోజు విజయ్ సినిమాలో నటించబోతుందట .దీనికి సంబంధించిన న్యూస్ కొలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.




