- Telugu News Photo Gallery Cinema photos Rashmika mandanna and sreeleela got two flops in the beginning of 2025
కొత్త సంవత్సరంలో బ్యాడ్ సెంటిమెంట్.. ఈ ముద్దుగుమ్మల కెరీర్ రన్నింగ్ లో సర్దుకుంటుందా ??
2024లోనే కంప్లీట్ కావాల్సిన టాస్క్, 2025 దాకా కంటిన్యూ కావడం ఏంటి? కొత్త సంవత్సరంలో బ్యాడ్ సెంటిమెంట్ అంటూ భయపెట్టడం ఏంటి? శ్రీలీల ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇదో టెన్షన్. కెరీర్‌కి కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ స్పీడు పెంచారు శ్రీలీల. ఆమె నటించిన రాబిన్‌హుడ్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. అందరూ బావున్నారా? అని అడుగుతూ రాబిన్‌హుడ్ ప్రమోషన్లలో ఇంట్రస్ట్ గా పార్టిసిపేట్ చేశారు శ్రీలీల.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Apr 02, 2025 | 5:57 PM

నేనూ, నితిన్ స్క్రీన్ మీద కనిపిస్తే దబిడి దిబిడే... మా కెమిస్ట్రీ మామూలుగా ఉండదు అంటూ మాటలతో హైప్ పెంచారు. అమ్మణి చెప్పింది ఒకటైతే, అక్కడ జరిగింది ఇంకొకటి. సినిమా ఏమాత్రం జనాలను అట్రాక్ట్ చేయలేకపోయింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో తడబడింది. పాటలు, స్టెప్స్ వరకు ఫర్వాలేదనిపించినా, సినిమా కథగా ఫెయిల్ అయింది.

ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తారు శ్రీలీలా? సైన్ చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు కథ వినండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారి సంఖ్య కూడా క్రమేణ పెరిగింది. తెలుగు నుంచి బాలీవుడ్‌కి వెళ్తున్నారు.. అక్కడైనా ఆచీతూచీ అడుగులు వేయండి. ఆఫర్లు వస్తున్నాయి కదా అని అన్నిటికీ సంతకాలు చేసేస్తే సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు బాధపడాల్సింది మనమే అని అంటున్నారు ఫ్యాన్స్.

ఇవే మాటలు కాస్త అటూ ఇటూగా రష్మిక విషయంలోనూ వినిపిస్తున్నాయి. ఒకటా, రెండా... ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్‌గా మారారు రష్మిక మందన్న. పుష్ప, యానిమల్, పుష్ప2, ఛావా.. ఇలా వరుస సక్సెస్‌లతో క్లౌడ్ నైన్‌లో కనిపించారు.

కానీ సికందర్, ఆమె సినిమా కెరీర్‌లో దిష్టి చుక్కలా మిగిలిందని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. రష్మిక లక్‌తో టీమ్ అందరికీ హిట్ వస్తుందని అనుకుంటే, సల్మాన్, మురుగదాస్, కాజల్... వీళ్లందరూ కలిసి రష్మికకు ఫ్లాప్ ఇచ్చారనే మీమ్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది సికందర్. సైలెంట్‌గా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ప్రీ రిలీజ్ టైమ్‌లో కాస్త బజ్ కనిపించినా, జనాలను థియేటర్లకు తీసుకు రావడానికి అది హెల్ప్ కాలేదు. సో, స్పీడు మీదున్న రష్మిక కెరీర్‌కి స్పీడ్ బ్రేకర్‌లా నిలిచింది సికందర్. ఈ ఏడాది ఇప్పటికేమీ పూర్తి కాలేదు. ఇంకా సినిమాలున్నాయి.. రిలీజులున్నాయి. అన్నిటికీ మించి కొత్తగా సైన్ చేయబోయే ప్రాజెక్టులున్నాయి. వాటి విషయంలోనైనా కాస్త జాగ్రత్తగా ఉంటే బావుంటుందనే సజషన్స్ వినిపిస్తున్నాయి.





























