- Telugu News Photo Gallery Cinema photos Rana Daggubati and Teja combo repeat with Movie Rakshasa Raja Movie Update Telugu Heroes Photos
Rana Daggubati: రాక్షసరాజు హిట్ కొడతాడా..!? తేజ – రానా కాంబోతో థియేటర్స్ ఆగమే!
రానా దగ్గుబాటి రాక్షస రాజు ఎలా ఉండబోతున్నాడు..? చాలా రోజులుగా సినిమాలు చేయని రానా.. ఫ్లాపుల్లో ఉన్న తేజకు ఛాన్స్ ఇవ్వడానికి కారణమేంటి..? నేనేరాజు నేనేమంత్రి కంటే బోల్డ్‌గా రాక్షస రాజు ఉండబోతుందా..? ప్రస్తుత రాజకీయాలపై తేజ తనదైన సెటైర్లు వేయబోతున్నారా..? 2022లో వచ్చిన విరాట పర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు.. దానికి ముందు వరస సినిమాలు చేసిన ఈయన.. రెండేళ్లుగా మాత్రం గ్యాప్ తీసుకున్నారు. అడిగితే నచ్చే కథ రావాలిగా అంటున్నారు.
Updated on: Jan 28, 2024 | 6:59 PM

రానా దగ్గుబాటి రాక్షస రాజు ఎలా ఉండబోతున్నాడు..? చాలా రోజులుగా సినిమాలు చేయని రానా.. ఫ్లాపుల్లో ఉన్న తేజకు ఛాన్స్ ఇవ్వడానికి కారణమేంటి..? నేనేరాజు నేనేమంత్రి కంటే బోల్డ్‌గా రాక్షస రాజు ఉండబోతుందా..? ప్రస్తుత రాజకీయాలపై తేజ తనదైన సెటైర్లు వేయబోతున్నారా..?

2022లో వచ్చిన విరాట పర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు.. దానికి ముందు వరస సినిమాలు చేసిన ఈయన.. రెండేళ్లుగా మాత్రం గ్యాప్ తీసుకున్నారు. అడిగితే నచ్చే కథ రావాలిగా అంటున్నారు. ఈ మధ్యే తేజ దర్శకత్వంలో రాక్షస రాజు సినిమా అనౌన్స్ చేసారు రానా.

నేనేరాజు నేనేమంత్రి తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రాక్షస రాజులో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను తేజ హైలైట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తోడల్లుళ్ల పాలిటిక్స్‌తో పాటు పవర్ కోసం జరిగే హత్యలు, ఒకే కుటుంబంలో భిన్న ధృవాల్లాంటి వ్యక్తుల మధ్య రాజకీయ చెలగాటాలు.. ఇలా చాలా సంచలన విషయాలపై రాక్షసరాజు కథలో తేజ ఫోకస్ చేయబోతున్నారు. నేనేరాజు నేనేమంత్రి కంటే ఇందులో పాలిటిక్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి.

నేనేరాజు నేనేమంత్రి తర్వాత తేజ తెరకెక్కించిన సీత, అహింస డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా రాక్షసరాజు కథ నచ్చడంతో పాన్ ఇండియన్ స్థాయిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లీడర్, నేనేరాజు నేనేమంత్రి తర్వాత రానా మరోసారి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నారు.

పైగా ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తేజకు మాత్రమే కాదు.. రానాకు కూడా రాక్షసరాజు కీలకంగా మారింది. ఎందుకంటే రానాకు సోలో హీరోగా సక్సెస్ వచ్చి చాలా కాలమైంది.. ఇంకా చెప్పాలంటే తేజ, రానా ఒకేసారి నేనేరాజుతో హిట్ కొట్టారు.

తర్వాత ఇద్దరికీ ఆ రేంజ్ హిట్ లేదు. ఎన్టీఆర్ బయోపిక్, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ కారెక్టర్స్ చేసారు రానా. మరిప్పుడు రాక్షసరాజు ఏం చేస్తాడో చూడాలిక.




