- Telugu News Photo Gallery Cinema photos Rowdy Boy Vijay Deverakonda Next 3 movies in 2024 Details Telugu Heroes Photos
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దూకుడు- ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు విడుదల.!
హిట్టు ఫ్లాపులతో మాకు పనిలేదమ్మా.. దర్శకుడు వచ్చాడా.. కథ చెప్పాడా.. ఓకే చేసామా.. పని పూర్తి చేసామా అన్నట్లుండాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్న రూట్ ఇదే. నిర్మాతలు కూడా ఈయన కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా అరడజన్ సినిమాలు చేస్తున్నారు. మరి విజయ్ లైనప్ ఏంటో ఓ సారి చూసేద్దామా..? లైగర్‌కు ముందు రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నారు విజయ్.. అలాగే అది విడుదలయ్యాక కూడా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు.
Updated on: Jan 28, 2024 | 6:59 PM

హిట్టు ఫ్లాపులతో మాకు పనిలేదమ్మా.. దర్శకుడు వచ్చాడా.. కథ చెప్పాడా.. ఓకే చేసామా.. పని పూర్తి చేసామా అన్నట్లుండాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్న రూట్ ఇదే. నిర్మాతలు కూడా ఈయన కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా అరడజన్ సినిమాలు చేస్తున్నారు.

మరి విజయ్ లైనప్ ఏంటో ఓ సారి చూసేద్దామా..? లైగర్‌కు ముందు రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నారు విజయ్.. అలాగే అది విడుదలయ్యాక కూడా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు. దాంతో ఈ గ్యాప్ ఇకపై ఉండకూడదని ఫిక్సయ్యారు రౌడీ హీరో.

అందుకే వరస మూవీస్ సైన్ చేస్తూనే ఉన్నారు. గతేడాది ఖుషి సినిమాతో ఓకే అనిపించిన ఈయన.. 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 3 సినిమాలు విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు. వరస సినిమాలు సైన్ చేయడమే కాదు.. వాటిని అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు కూడా.

ఇప్పటికే పరశురామ్‌తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా ఎప్రిల్ 5న విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ సైతం వేగంగానే జరుగుతుంది. ఫ్యామిలీ స్టార్ కోసం దీన్ని హోల్డ్‌లో పెట్టిన విజయ్.. మార్చ్ నుంచి రీ స్టార్ట్ చేయనున్నారు.

ఇందులో శ్రీలీల తప్పుకుందనే వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తేల్చేసారు నిర్మాతలు. ముందుగా చెప్పినట్లుగానే శ్రీలీలే ఇందులో హీరోయిన్. గౌతమ్ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ 2024లోనే విడుదల కానుంది..

రెండో భాగం వచ్చే ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయ్. ఫ్యామిలీ స్టార్, గౌతమ్ సినిమాలు సెట్స్‌పై ఉండగానే.. విజయ్‌తో మరో రెండు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు.

రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలాతో ఓ సినిమా.. ఇంద్రగంటి ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. దాంతో పాటు మైత్రి మూవీ మేకర్స్‌లో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్‌తో ఒకటి.. మలయాళం దర్శకుడు టినూ పప్పచ్చన్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మరో మూడేళ్ల వరకు విజయ్ డైరీ ఫుల్ అయిపోయింది.




