- Telugu News Photo Gallery Cinema photos Pan india Star Prabhas give Break for Movies due to health issues Telugu Heroes Photos
Prabhas: షాకింగ్ నిర్ణయం తీసుకున్న డార్లింగ్.! ఆ రెండు మూవీస్ తరువాతే సలార్ 2, స్పిరిట్.
ప్రభాస్ కెరీర్‌లో మరో లాంగ్ బ్రేక్ తప్పదా..? నిన్నమొన్నటి వరకు రోజు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ చేసిన రెబల్ స్టార్.. ఉన్నట్లుండి నెల రోజులకు పైగానే బ్రేక్ తీసుకోబోతున్నారా..? సడన్ బ్రేక్‌కు రీజన్ హెల్త్ ఇష్యూసా లేదంటే రిలాక్స్ అవ్వడానికే యూరప్ వెళ్లబోతున్నారా..? ప్రభాస్ సర్జరీ ఇష్యూ మళ్లీ తిరగబెట్టిందా..? గత ఆరేడు నెలలుగా క్షణం తీరికలేకుండా వరసగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. ఓ వైపు సలార్.. మరోవైపు కల్కి.. ఇంకోవైపు ఖాళీ టైమ్ దొరికినపుడు మారుతి రాజా సాబ్ సినిమాలు పూర్తి చేస్తున్నారు ప్రభాస్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Feb 04, 2024 | 9:09 PM

ప్రభాస్ కెరీర్‌లో మరో లాంగ్ బ్రేక్ తప్పదా..? నిన్నమొన్నటి వరకు రోజు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ చేసిన రెబల్ స్టార్.. ఉన్నట్లుండి నెల రోజులకు పైగానే బ్రేక్ తీసుకోబోతున్నారా..? సడన్ బ్రేక్‌కు రీజన్ హెల్త్ ఇష్యూసా లేదంటే రిలాక్స్ అవ్వడానికే యూరప్ వెళ్లబోతున్నారా..?

ప్రభాస్ సర్జరీ ఇష్యూ మళ్లీ తిరగబెట్టిందా..? గత ఆరేడు నెలలుగా క్షణం తీరికలేకుండా వరసగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. ఓ వైపు సలార్.. మరోవైపు కల్కి.. ఇంకోవైపు ఖాళీ టైమ్ దొరికినపుడు మారుతి రాజా సాబ్ సినిమాలు పూర్తి చేస్తున్నారు ప్రభాస్.

ఇందులో సలార్ మొన్న డిసెంబర్‌లో విడుదలై దాదాపు 700 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఫోకస్ అంతా కల్కి, రాజా సాబ్‌పై పెట్టారు ప్రభాస్. తీరిక లేకుండా షూట్ చేస్తుండటంతో బాగా అలిసిపోయారు ప్రభాస్.

అందుకే నెల రోజులకు పైగానే బ్రేక్ ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే యూరప్ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ట్రిప్ రిలాక్స్ కోసమని కొందరు చెప్తుంటే.. కాదు సర్జరీ కోసమని మరికొందరు అంటున్న మాట.

బాహుబలి సమయంలోనే ప్రభాస్ కాలికి గాయాలయ్యాయి. అప్పట్నుంచి ఆ గాయాలు రెబల్ స్టార్‌ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. గతేడాది యూరప్ వెళ్లి కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు ప్రభాస్.

ఆ తర్వాత మళ్లీ సలార్, కల్కి, రాజా సాబ్‌తో బిజీ అయిపోయారు. తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా గాయం తిరగబెట్టినట్లు తెలుస్తుంది. సలార్‌లో ఫైట్ సీక్వెన్సులు చేయడంతో గాయం మళ్లీ మొదటికి వచ్చిందని.. దానికోసమే సర్జరీ కోసం యూరప్‌కు వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది.

అందుకే 40 రోజుల బ్రేక్ తీసుకోబోతున్నారు ప్రభాస్. వచ్చిన తర్వాత ముందు కల్కి, రాజా సాబ్ పూర్తి చేసి.. ఆ తర్వాతే సలార్ 2, స్పిరిట్‌పై ఫోకస్ చేయబోతున్నారు ప్రభాస్. మరి నిజంగానే సర్జరీ కోసమే వెళ్తున్నారా లేదంటే రిలాక్స్ కోసమా అనేది ప్రభాసే చెప్పాలి.





























