పీరియాడిక్ సినిమాలకు ఈ మధ్య మామూలు క్రేజ్ లేదు. కథ చెప్పాలంటే కనీసం 20-30 ఏళ్ళు.. కుదిర్తే 50 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు. ఏ హీరోను తీసుకున్నా ట్రేడ్‌లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. పైగా హిస్టారికల్ సినిమాలకు సక్సెస్ పర్సెంటేజ్ బానే ఉంది. గత రెండు మూడేళ్లలో వచ్చిన సార్, ఉప్పెన, ట్రిపుల్ ఆర్, రంగస్థలం, పుష్ప లాంటివన్నీ 20 నుంచి 50 ఏళ్ల నాటి పీరియాడిక్ కథలే.