
ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నందమూరి బాలకృష్ణ, రవితేజ, నితిన్, రామ్, వైష్ణవ్ తేజ్ తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రీలీల

ఇటీవలే పుష్ప 2 సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్ లో తళుక్కమన్న శ్రీలీల చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అందులో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి.

సినిమాలతో బిజీ బిజీగా ఉండే శ్రీలీల ఇటీవల బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్సీకే టాక్ షోకు గెస్టుగా వెళ్లింది. జాతి రత్నం నవీన్ పొలిశెట్టి కూడా ఈ షోలో సందడి చేశాడు.

ఈ సందర్భంగా శ్రీలీల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. శ్రీలీల నా కూతురిలాంటిదని, ఆమెను చూస్తుంటే నా కూతురే గుర్తొస్తుందని అన్నారు. శ్రీలీల పెళ్లి తండ్రిగా నా బాధ్యత అని చెప్పుకొచ్చారు.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించింది. అప్పటి నుంచే వీరిద్దరి మంచి అనుబంధం ఏర్పడింది.

శ్రీలీల ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉంది. నితిన్‌తో కలిసి శ్రీలీల నటించిన 'రాబిన్ హుడ్' చిత్రం వచ్చే వారం విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండ సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. ఓ తమిళ, బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.