అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ టైటిల్‌కి అనర్హం అంటున్నారు మన దర్శకులు. టైటిల్ కొత్తగా ఉన్నపుడే ఆసక్తి కూడా డబుల్ అవుతుంది. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా పెట్టేస్తున్నారు. తాజాగా శనివారాన్ని నాని తీసుకున్నారు. మరి ఇలా వచ్చిన టైటిల్స్ ఏంటో ఓ లుక్ వేద్దామా..