Tollywood News: బిగ్ బ్రేక్ తీసుకోనున్న మెగా హీరోలు.. సెర వేగంగా జరుగుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్
మెగా హీరోలంతా ఈ వారం బ్రేక్ తీసుకోబోతున్నారు.. వరుణ్ తేజ్ పెళ్లి కారణంగా అంతా ఇటలీ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మాత్రం ఇప్పటికీ కన్ఫ్యూజన్‌లోనే ఉంది. మరోవైపు బాలయ్య, రవితేజ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ షెడ్యూల్స్ ఏం లేకపోవడంతో కుటుంబంతో పాటు ఇటలీ వెళ్లారు చరణ్. వీళ్లు మినహా హీరోలందరూ లొకేషన్‌లోనే ఉన్నారు. మరి ఆ డీటైల్స్ చూద్దామా..? ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఆశ పడ్డారు కానీ అవేం జరగలేదు.