Aishwarya Sheoran : మోడలింగ్ మానేసి ఐఏఎస్ అయిన మిస్ ఇండియా ఫైనలిస్ట్..! తొలి ప్రయత్నంలోనే విజయం..
Aishwarya Sheoran : రాజస్థాన్‌లోని చురు నివాసి అయిన ఐశ్వర్య షియోరన్ యుపిఎస్‌సి పరీక్ష కోసం మోడలింగ్ వృత్తిని వదులుకుని, మొదటి ప్రయత్నంలో ఐఎఎస్ సాధించింది.
Updated on: Jul 14, 2021 | 1:38 PM

ఐశ్వర్య షియోరన్ ఏ కోచింగ్ తీసుకోకుండా యుపిఎస్సి పరీక్షను క్లియర్ చేసింది. ఐఎఎస్ అధికారి అయింది. ఆమె 10 నెలలు ఇంట్లో ప్రిపేర్ అయి మొదటి ప్రయత్నంలో 93 వ ర్యాంకును సాధించింది.

యుపిఎస్సి పరీక్షకు సిద్ధం కావడానికి ముందే ఐశ్వర్య షియోరన్ మోడల్. అయితే ఐఏఎస్ తన లక్ష్యమని 2018 లో ప్రిపరేషన్ ప్రారంభించి మొదటి ప్రయత్నంలో విజయం సాధించింది.

ఐశ్వర్య షియోరన్ 2016 లో మిస్ ఇండియా ఫైనలిస్ట్. 2015 లో ఆమె మిస్ ఢిల్లీ కిరీటం గెలుచుకుంది. 2014 లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్ గా ఎంపికైంది.

ఐశ్వర్య షియోరన్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తుంది. ఆమె చాణక్యపురిలోని సంస్కృత పాఠశాల నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఐశ్వర్య 12 వ తరగతిలో 97.5% మార్కులు సాధించింది.

2018 లో ఐశ్వర్య షియోరన్ ఐఐఎం ఇండోర్‌కి కూడా ఎంపికైంది కానీ ఐఎఎస్ కోసం అది వదులుకుంది.