- Telugu News Photo Gallery Cinema photos Mirai actress ritika nayak latest beautiful photos goes viral
Ritika Nayak: మిరాయ్ భామ మెరుపులు.. అదరగొట్టిన రితిక నాయక్
రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
Updated on: Oct 27, 2025 | 2:29 PM

రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.

రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు. నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది ఈ వయ్యారి భామ. ఇటీవలే బస్టర్ అందుకుంది

తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. మిరాయ్ సినిమా తర్వాత ఈ చిన్నదాని క్రేజ్ మారిపోయింది. ఇక ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రాబోతున్న కొరియన్ డ్యాక్ డ్రాప్ హారర్ కామెడీ మూవీలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నసినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది రితిక నాయక్. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో ఈ చిన్నది దూసుకుపోతుంది.రితికా నాయక్ తన అందం, నటనా నైపుణ్యంతో తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకుంటూ ఆకట్టుకుంటుంది.




