ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అంటున్న మాళవిక.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్న ముద్దుగుమ్మ
మాలవిక మోహనన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమా స్పీడ్ గా వైరల్ అవుతుంది. అందులోనూ రాజమౌళి పేరు ప్రస్తావించడంతో క్షణాల్లో స్పీడ్ అయింది వార్త. ఇంతకీ ఈ హాట్ బ్యూటీ జక్కన్న గురించి ఏమన్నారో ?? ది రాజా సాబ్ కోసం ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నారు మాలవిక మోహనన్. నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
Updated on: Jun 22, 2025 | 5:24 PM

నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లోను మాలవికకు మంచి సీన్స్ కనిపించాయి. టీజర్ లో జస్ట్ టీజ్ చేశారంతే పిక్చర్ అబ్బి బాకీ హై అంటున్నారు మాలవిక మోహనన్.

డార్లింగ్ తో పక్కా మాస్ మసాలా సాంగ్ లో స్టెప్పులు గ్యారెంటీగా ఉంటాయని చెబుతున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్స్ కి పండగలా ఉంటుందన్నది ఈ లేడీస్ తో ఇచ్చిన చిన్న హింట్ మాత్రమే.

ది రాజా సాబ్ తర్వాత తెలుగులో తప్పక హల్ చల్ చేస్తాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఈ మల్లు బ్యూటీలో. అన్నట్టు తెలుగులో ఆమె ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అట.

తప్పకుండా జక్కన్న తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు మాలవిక. తెలుగులో ది రాజా సాబ్, తమిళంలో సర్దార్ 2, మలయాళంలో హృదయపూర్వంలో నటిస్తున్నారు మాలవిక మోహనన్.

త్వరలోనే ది రాజా సాబ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో సందడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నానన్నారు. ఈ ఏడాది హిట్ గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మాలవిక మాటల్లో.




