Mamitha Baiju: ముద్దుగుమ్మ మమిత బైజు క్యూట్ ఫొటోస్.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
మమిత 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆపరేషన్ జావా (2021), ఖో ఖో (2021), సూపర్ శరణ్య (2022), ప్రణయ విలాసం (2023) వంటి చిత్రాలలో అల్ఫోన్సా, అంజు, సోనా, గోపిక పాత్రలతో ఈ ముద్దుగుమ్మ గుర్తింపు పొందింది. ఖో.. ఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది
Updated on: Jun 22, 2025 | 3:17 PM

మమిత 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆపరేషన్ జావా (2021), ఖో ఖో (2021), సూపర్ శరణ్య (2022), ప్రణయ విలాసం (2023) వంటి చిత్రాలలో అల్ఫోన్సా, అంజు, సోనా, గోపిక పాత్రలతో ఈ ముద్దుగుమ్మ గుర్తింపు పొందింది.

ఖో.. ఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. 2024లో విడుదలైన ప్రేమలు చిత్రం మమితకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇది మలయాళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దాంతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది.

తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఒక్కసారిగా ఈ చిన్నదాని క్రేజ్ డబుల్ అయ్యింది. దీంతో ఆమెకు తెలుగు నిర్మాతల నుండి ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది.

సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో బలమైన కథాపాత్రలు, మంచి స్క్రిప్ట్‌లతో తెలుగులో అడుగుపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో తలపతి 69, విష్ణు విశాల్‌తో ఒక చిత్రం, ప్రదీప్ రంగనాథన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక చిత్రం, అథర్వాతో మరో చిత్రంలో నటిస్తోంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఆమె స్టైల్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని క్యూట్ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




