- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Guntur Karam Movie team create Hope in the Movie Telugu Heroes Photos
Guntur Karam: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరోడి ఘాటు.! రిలీజ్ కి ముందే..
ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లు గుంటూరు కారం ఫీవర్‌లో ఉన్నాయి. ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటి పడుతున్నా.. గుంటూరు కారం మీదే బజ్ ఎక్కువగా ఉంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు మేకర్స్, కాస్త ఆలస్యమైనా... అంతకు మంచి అన్న రేంజ్‌లో జరిగింది గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్.
Updated on: Jan 11, 2024 | 2:28 PM

ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లు గుంటూరు కారం ఫీవర్‌లో ఉన్నాయి. ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటి పడుతున్నా.. గుంటూరు కారం మీదే బజ్ ఎక్కువగా ఉంది.

రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు మేకర్స్, కాస్త ఆలస్యమైనా... అంతకు మంచి అన్న రేంజ్‌లో జరిగింది గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్.

వేలాదిగా తరలి వచ్చిన మహేష్ అభిమానులతో గుంటూరు సిటీ అంతా నిండిపోయింది. అభిమానుల తాకిడి ముందే ఊహించిన ఆర్గనైజర్స్ భారీ ఏర్పాట్లు చేసినా... అవి కూడా చాలనంతగా ఫ్యాన్స్ ఈవెంట్ చూసేందుకు వచ్చారు.

సినిమా కథ అంతా గుంటూరు చుట్టూనే తిరుగుతుంది కాబట్టి... ఈవెంట్ అక్కడ చేయటమే పర్ఫెక్ట్ అయిన ఫిక్స్ అయిన యూనిట్, నంబూరు ఎక్స్‌రోడ్స్‌లో భారీ వేదికను సిద్ధం చేసింది.

కళ్ల చెదిరే ఏర్పాట్లతో ఫ్యాన్స్‌కు స్వాగతం పలికింది గుంటూరు కారం టీమ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇప్పుడు వేదిక మీద చిత్రయూనిట్ చెప్పిన మాటలతో ఆ అంచానాలు డబుల్ అయ్యాయి. ముఖ్యంగా ఈవెంట్‌లో మహేష్ కాన్ఫిడెన్స్ చూసి మరో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్ అయ్యారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.




