- Telugu News Photo Gallery Cinema photos Samantha as in Pushpa oo antava song who as in Pushpa 2 for item song Telugu Heroes Photos
Allu Arjun – Pushpa 2: పుష్పలో సమంత ఊ అంటావా..! మరి పుష్ప 2 లో ఎవరంటే.?
బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప నార్త్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా బిగ్ కాన్వస్‌ను సిద్ధం చేస్తోంది పుష్ప రాజ్ టీమ్. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటమే కాదు, నార్త్ ఆడియన్స్‌కు సౌత్ మాస్ కంటెంట్ సత్తా ఏంటో చూపించింది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Jan 12, 2024 | 6:54 AM

బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప నార్త్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా బిగ్ కాన్వస్‌ను సిద్ధం చేస్తోంది పుష్ప రాజ్ టీమ్.

అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటమే కాదు, నార్త్ ఆడియన్స్‌కు సౌత్ మాస్ కంటెంట్ సత్తా ఏంటో చూపించింది.

తొలి భాగం సంచలన విజయం సాధించటంతో సీక్వెల్‌ను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. తొలి భాగం సక్సెస్‌లో ఐటమ్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది.

అల్లు అర్జున్‌తో పాటు సమంత ఆడి పాడిన ఊ అంటావా... పాట సౌత్ నార్త్ ఆడియన్స్‌ను షేక్ చేసింది. అందుకే సీక్వెల్‌లోను అలాంటి ఓ పాటను ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. తాజాగా ఆ పాట షూటింగ్ మొదలైంది.

పుష్ప పార్ట్ 2 కోసం రెడీ చేస్తున్న ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆడి పాడుతున్నారు. ఊ అంటావా పాటలో సమంత మాత్రమే బన్నీతో స్టెప్పేశారు. కానీ ఇప్పుడు సీక్వెల్ కోసం సిద్ధం చేస్తున్న ఐటమ్ సాంగ్‌లో కృతి సనన్, దిశా పాట్ని... ఇద్దరూ ఐకాన్ స్టార్‌తో కలిసి స్టెప్పేస్తున్నారు.

ఐటమ్ సాంగ్స్ ఇవ్వటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న దేవీ శ్రీ ప్రసాద్, పుష్ప 2 కోసం మరో బ్లాక్ బస్టర్ ట్యూన్‌ను సిద్ధం చేశారు. ఈ పాటతో మరోసారి థియేటర్లను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు పుష్పరాజ్.





























