- Telugu News Photo Gallery Cinema photos Makers have started promoting for Sankranthi movies on a massive scale
Movie Promotions: సంక్రాంతి పండుగ వేళ సినిమాల యుద్ధం.. ప్రమోషన్ల విషయంలో తగ్గదేలే..
సంక్రాంతి పండగ ఈ సారి ఎంత సందడిగా ఉండబోతోందో అప్పుడే విట్‌నెస్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఒకటికి నాలుగు సినిమాలు మన వైపు నుంచి బరిలోకి దిగనున్నాయి. ఎవరికి వారే నువ్వా నేనా అంటూ ప్రమోషన్లను షురూ చేశారు. రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రీ రిలీజ్ సందడి మాత్రం భలేగా ఉందంటూ ఆస్వాదిస్తున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి పండగ ఈ సారి ఎంత సందడిగా ఉండబోతోందో అప్పుడే విట్‌నెస్ చేస్తున్నారు. హనుమాన్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ముందస్తు వేడుకకు హాజరయ్యారు.
Updated on: Jan 11, 2024 | 3:11 PM

సంక్రాంతి పండగ ఈ సారి ఎంత సందడిగా ఉండబోతోందో అప్పుడే విట్‌నెస్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఒకటికి నాలుగు సినిమాలు మన వైపు నుంచి బరిలోకి దిగనున్నాయి. ఎవరికి వారే నువ్వా నేనా అంటూ ప్రమోషన్లను షురూ చేశారు. రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రీ రిలీజ్ సందడి మాత్రం భలేగా ఉందంటూ ఆస్వాదిస్తున్నారు ఫ్యాన్స్.

గుంటూరు కారం ట్రైలర్ చూసిన ఘట్టమనేని ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. మావాడు మరీ మాస్‌గా కనిపిస్తున్నాడు. నెవర్ బిఫోర్ అంటూ పండగను ముందే మొదలుపెట్టేశారు. ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్‌నీ మళ్లీ మళ్లీ చూసుకుని మురిసిపోతున్నారు. ఈ సంక్రాంతికి గుంటూరు కారం పర్ఫెక్ట్ సినిమా అనే టాక్ తెచ్చేసింది ట్రైలర్.

ఇటు హనుమాన్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ముందస్తు వేడుకకు హాజరయ్యారు. కోటి అనే కోతి కేరక్టర్‌కి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుందని వరలక్ష్మీ శరత్‌కుమార్ ఆల్రెడీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రిచ్ విజువల్స్ తో సంక్రాంతికి రెడీ అవుతోంది తేజ సజ్జా హనుమాన్.

న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో మా సినిమా చూస్తే అర్థమైపోతుందని చెప్పేశారు విక్టరీ వెంకటేష్. ఆయన హీరోగా నటించిన సైంధవ్ సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చేసింది. ఆల్రెడీ కాలేజీల్లో ప్రమోట్ చేశారు వెంకీమామ. రీసెంట్‌గా వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అక్కడ కూడా యాక్టివ్‌గా ప్రమోట్ చేశారు. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హిట్ సైంధవ్‌తో వస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు వెంకీ.

నా సామి రంగలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయంటున్నారు అక్కినేని హీరో. ఈ మధ్యనే ఫ్రెండ్‌షిప్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే... అని ప్రతి ఒక్కరూ టిక్కెట్లను బుక్ చేసేసుకుంటారనే ధీమా కనిపిస్తోంది మూవీ టీమ్‌లో.




