- Telugu News Photo Gallery Cinema photos Junior NTR and director Sandeep Reddy Vanga are waiting because of Prabhas
Prabhas: ప్రభాస్ కారణంగా ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా వెయిటింగ్.. అసలు విషయం ఏంటంటే..
సలార్ 2 విషయంలో క్లారిటీ ఇచ్చిన ప్రభాస్... హీరో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను వెయిటింగ్‌లో పెట్టేశారు. అదేంటి.. సలార్‌కు ఎన్టీఆర్, సందీప్‌లకు లింకేంటి అనుకుంటున్నారా...? అయితే ఈ స్టోరి మీద ఓ లుక్కేసేయండి. సలార్ సినిమా సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ వెంటనే కావాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఎగ్జైట్మెంట్‌ను అర్ధం చేసుకున్న డార్లింగ్ సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jan 11, 2024 | 3:45 PM

సలార్ 2 విషయంలో క్లారిటీ ఇచ్చిన ప్రభాస్... హీరో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను వెయిటింగ్‌లో పెట్టేశారు. అదేంటి.. సలార్‌కు ఎన్టీఆర్, సందీప్‌లకు లింకేంటి అనుకుంటున్నారా...? అయితే ఈ స్టోరి మీద ఓ లుక్కేసేయండి.

సలార్ సినిమా సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ వెంటనే కావాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఎగ్జైట్మెంట్‌ను అర్ధం చేసుకున్న డార్లింగ్ సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. అతి త్వరలో పార్ట్ 2 సెట్స్ మీదకు వెళుతుందని వీలైనంత త్వరగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

ప్రభాస్ స్టేట్మెంట్‌తో ఎన్టీఆర్ అభిమానులు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న దేవర సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నెక్ట్స్ మూవీ పట్టాలెక్కుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సలార్ 2 లైన్‌లోకి రావటంతో ఎన్టీఆర్ మూవీ డీలే కానుందని ఫీల్ అవుతున్నారు.

తారక్ మాత్రం ఈ గ్యాప్‌లో మరో రెండు సినిమాలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా వాయిదా పడినా... వార్ 2తో పాటు దేవర పార్ట్ 2ను కూడా ఈ గ్యాప్‌లోనే పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు జూనియర్.

యానిమల్ సక్సెస్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని త్వరలో పట్టాలెక్కించబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. కానీ స్వయంగా ప్రభాసే సలార్ 2ను ముందుకు తీసుకురావటంతో స్పిరిట్ కూడా వాయిదా పడనుందని తేలిపోయింది.





























