Movie Updates: జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?

| Edited By: Prudvi Battula

Jul 16, 2024 | 3:24 PM

ప్రజెంట్ మన హీరోల సినిమాల స్టేటసేంటి..? ఏ హీరో ఎక్కడ షూట్ చేస్తున్నారు? కొత్త సినిమాల సెట్స్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు..? ఆల్రెడీ ఆన్ లొకేషన్ ఉన్న సినిమా షూటింగ్స్‌ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఇలాంటి ఇంట్రస్టింగ్ డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5
కల్కి 2898 ఏడీ సక్సెస్ సెలబ్రేషన్స్‌ కంటిన్యూ చేస్తూనే షూటింగ్స్‌కు కూడా టైమ్ ఇస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ రాజాసాబ్‌. ఈ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతోంది. 

2 / 5
 ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభరలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా షూటింగ్‌ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

3 / 5
 గత నెలలో షూటింగ్స్‌ రీస్టార్ట్ చేసిన నందమూరి బాలకృష్ణ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే బాబీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది దసరా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ధనుష్‌, నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న కుబేర షూట్ కూడా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లోనే జరుగుతోంది.

4 / 5
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ మధ్యే కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన మిస్టర్ బచ్చన్‌ టీమ్‌ హైదరాబాద్ ఐడీపీఎల్ కాలనీలో షూటింగ్ చేస్తోంది. 

5 / 5
 నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం షూటింగ్ సిటీ కాలేజ్‌లో జరుగుతోంది. సూపర్ స్టార్‌ రజనీకాంత్ కూడా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.