- Telugu News Photo Gallery Cinema photos Kollywood movies Ayalaan, Thangalan, Captain Miller and others will release on Sankranti
Kollywood News: కోలీవుడ్ లో పండగకి సందడే.. వరసగా పాన్ ఇండియా చిత్రాలు..
పండగ టైమ్‌లో సందడి చేయడానికి జస్ట్ మన సినిమాలే కాదు, ప్యాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ నుంచి చాలా సినిమాలే రెడీ అవుతున్నాయి. అందులోనూ కోలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు బాగానే ఉన్నాయి ఈ సారి క్యూలో. ఒక్కో సినిమా, ఒక్కో హీరోకి, ఒక్కో రకంగా స్పెషల్ అన్నమాట. ఇంతకీ ఏమిటా సినిమాలు... చూసేద్దామా... ఇక విలన్ రోల్స్ చేయనంటూ ఈ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చిన సేతుపతి, ఇప్పుడు హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్ మెర్రీ క్రిస్మస్. ధనుష్ కెప్టెన్ మిల్లర్ మీద సందీప్ కిషన్ కూడా మంచి హోప్సే పెట్టుకున్నారు.
Updated on: Dec 19, 2023 | 2:15 PM

చూశారుగా విజయ్ సేతుపతి వెర్సటాలిటీని. ఇక విలన్ రోల్స్ చేయనంటూ ఈ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చిన సేతుపతి, ఇప్పుడు హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్ మెర్రీ క్రిస్మస్. ఇందులో సేతుపతి పాజిటివ్‌గా కనిపిస్తారా? నెగటివ్‌గా చేస్తారా? అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. కత్రినా కైఫ్ నాయికగా నటించిన ఈ సినిమా మీద నార్త్ లోనూ మంచి హోప్స్ ఉన్నాయి.

ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎదురుచూస్తున్న మరో సినిమా కెప్టెన్ మిల్లర్. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ మీద ధనుష్ కూడా ఆశలు పెంచుకున్నారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ మీద సందీప్ కిషన్ కూడా మంచి హోప్సే పెట్టుకున్నారు.

అల్లుడు ధనుష్ కెప్టెన్ మిల్లర్‌తో వస్తుంటే, కూతురుని సపోర్ట్ చేయడానికి రజనీకాంత్ లాల్ సలామ్ అంటూ ఈ జనవరిలో థియేటర్లలోకి దూసుకొస్తున్నారు. చేసింది గెస్ట్ రోల్ అయినా రజనీ పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు ఐశ్వర్య రజనీకాంత్.

విక్రమ్ హీరోగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా తంగలాన్. విక్రమ్ గెటప్ నుంచి, కాన్సెప్ట్ వరకు ప్రతిదీ స్పెషల్‌గా ఉంటుందని అంటున్నారు మేకర్స్. పొన్నియిన్ సెల్వన్‌తో మెప్పించిన విక్రమ్‌కి, తంగలాన్ పక్కా మాస్ మూవీ అవుతుంది.

గత కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు శివ కార్తికేయన్. బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన శివకార్తికేయన్, నెక్స్ట్ ఆశలన్నీ అయలాన్ మీదే పెట్టుకున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. పిల్లలను అట్రాక్ట్ చేసే విషయాలు అయలాన్‌లో మెండుగా ఉన్నాయని, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్నది మేకర్స్ మాట.




