Tollywood : టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు..? ఈ ముద్దుగుమ్మల్లో మీ ఓటు ఎవరికి.?
Rajeev Rayala |
Updated on: Dec 01, 2022 | 1:31 PM
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించాలని ఈ మధ్య ముద్దుగుమ్మలంతా తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి అలంటి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు.?
Dec 01, 2022 | 1:31 PM
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించాలని ఈ మధ్య ముద్దుగుమ్మలంతా తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి అలంటి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు.?
1 / 7
సమంత.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సామ్ నటించిన శాకుంతలం, ఖుషీ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
2 / 7
ఇక రష్మిక మందన్న సైతం టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసారు. పుష్ప 2 మినహా.. ఈమె తెలుగులో మరే సినిమా చేయట్లేదు. రష్మిక చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయి. అక్కడే వరస సినిమాలు చేస్తున్నారు. దాంతో టాలీవుడ్ నెం.1 హీరోయిన్ రేసులో నుంచి రష్మిక బయటికి వచ్చేసినట్లే..
3 / 7
పూజ హెగ్డే.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది. ఆ అమ్మడు కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.
4 / 7
ఇక కీర్తిసురేష్ విషయానికొస్తే.. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ చిన్నది. ఇప్పుడు టాలీవుడ్ ఫ్యావరెట్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలతోనూ సినిమాలు చేస్తోంది.
5 / 7
వీళ్లకు పోటీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ కూడా టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. ఈ చిన్నది ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ సీ 15లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
6 / 7
ఇటీవలే సీతారామం సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. ఈ చిన్నది తెలుగు లో నటించిన ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఏ స్టార్ తో సినిమా చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.