పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కీర్తి.. తెల్లటి గౌనులో ఎంత బాగుందో..
మహానటి సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొని ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను శైలజా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే హీరోయిన్ గా సత్తాచాటుకుంది. వరసగా స్టార్ హీరోల సరసన చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
Updated on: Feb 17, 2025 | 1:31 PM

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కీర్తీ సురేష్ తెలుగులో అగ్రహీరోలందరి సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్న విషయ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదని సినీ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ బ్యూటీ నార్త్ పై కన్నేసి, బాలీవుడ్ లో వరస సినిమాలతో సందడి చేస్తుంది. తాజాగా బేబీజాన్ సినిమాతో పలకరించిన ఈ బ్యూటీ, బాలీవుడ్ లోనే మరో ప్రాజెక్ట్ కూడా సైన్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని థట్టిల్ ను డిసెంబర్ 12,2024లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ బ్యూటీ తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.

వీరు హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇటీవల హిందూ సంప్రాదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఫొటోలు షేర్ చేయగా, తాజాగా క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్న ఫోటోస్ ను తన అభిమానులతో పంచుకుంది.

తెల్లటి గౌన్ లో కీర్తి చూడ ముచ్చటగా ఉన్నారు. చేతిలో ఫ్లవర్స్, ముఖంపై పలచటి ముసుగులో ఎంతో అందంగా ఉంది మహానటి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.