- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD created an all time record in the first weekend
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మేనియా.. ఫస్ట్ వీకెండ్ ఆల్ టైమ్ రికార్థుల పర్వం..
ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898 ఏడీ మేనియా కంటిన్యూ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే నెవ్వర్ బిఫోర్ నెంబర్స్ టచ్ చేసి కల్కి, ఆఫ్టర్ రిలీజ్ మరింత స్పీడుగా రికార్డ్‌లు కొల్లగొడుతోంది.
Updated on: Jul 02, 2024 | 1:32 PM

ఒక్కో రోజు గడుస్తుంటే ఒక్కో రికార్డ్ కల్కి 2898 ఏడీ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. ఆల్రెడీ ఓవర్ సీస్‌లో ఇండియన్ సినిమాల రికార్డ్‌ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌కు చేరింది పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలైన కల్కి 2898 ఏడీ.

ప్రీ సేల్స్‌లో ఆల్‌టైమ్ హై వసూళ్లు సాధించిన ఈ మూవీ, ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే స్పీడుతో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది కల్కి సినిమా.

ఓవర్ సీస్‌లో తొలి నాలుగు రోజుల్లోనే 11.2 మిలియన్ల డాలర్ల వసూళ్లు సాదించింది ఈ మూవీ. అంటే మన కరెన్సీ లెక్కల్లో ఓవర్ సీస్‌లోనే వంద కోట్లకు దగ్గరల్లో ఉంది కల్కి. ఇప్పటి వరకు ఓవర్‌సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ యానిమల్ పేరిట ఉంది. ఆ రికార్డ్‌ను కూడా ఒకటి రెండు రోజుల్లోనే కల్కి తుడిచిపెట్టేయనుంది.

ఇండియాలోనూ కల్కి జోరు మామూలుగా లేదు. థియేటర్లలో మరే స్టార్ హీరో సినిమా లేకపోవటం, ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావటంతో కల్కి థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. అందుకే తొలి వారాంతానికే 555 కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది కల్కి 2898 ఏడీ.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి వారాంతానికి 500 కోట్ల మార్క్ టచ్ చేసిన సినిమా మరోటి లేదు. నియర్ ఫ్యూచర్‌లో మరో సినిమాకు ఆ ఛాన్స్ ఉండే అవకాశం కూడా కనిపించటం లేదు.




