- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Comedian Mohan Ties the Knot in Grand Wedding, Shares Photos
Jabardasth: పెళ్లిపీటలెక్కిన జబర్తస్త్ కమెడియన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లిపీటలెక్కాడు. ఈ వేడుకలో పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Updated on: Apr 01, 2024 | 5:41 PM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లిపీటలెక్కాడు. ఈ వేడుకలో పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో జబర్దస్త్ మోహన్ వివాహం జరిగింది. ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు తదితరులు హాజరయ్యారు

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు జబర్దస్త్ సెలబ్రిటీలు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను గడ్డం నవీన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.

ప్రస్తుతం జబర్దస్త్ మోహన్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా జబర్దస్త్ కామెడీ షో లేడీ గెటప్పులకు మోహన్ బాగా ఫేమస్. ముఖ్యంగా తన స్లాంగ్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడంలో మోహన్ బాగా దిట్ట.