- Telugu News Photo Gallery Cinema photos Isha Ambani wears Tamilian jadai hairstyle for Anant Ambani Radhika Merchant pre wedding event see photos
Isha Ambani: తమిళనాడు బ్రైడల్ స్టైల్లో అందంగా ఇషా అంబానీ.. వాలు జడతో చూడచక్కని చందమామ..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారం పదిరోజులుగా ముంబైలో పండగ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం వివాహనికి ముందు జరిగే సాంప్రదాయ వేడుకల్లో ఫ్యామిలీ మెంబర్స్ ట్రెడీషనల్ అటైర్స్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముకేష్ అంబానీ, నీతూ అంబానీల ముద్దుల కూతురు ఇషా అంబానీ తమిళనాడు బ్రైడల్ స్టైల్లో మరింత అందంగా మెరిసిపోయింది.
Updated on: Jul 11, 2024 | 3:08 PM

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారం పదిరోజులుగా ముంబైలో పండగ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం వివాహనికి ముందు జరిగే సాంప్రదాయ వేడుకల్లో ఫ్యామిలీ మెంబర్స్ ట్రెడీషనల్ అటైర్స్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ముకేష్ అంబానీ, నీతూ అంబానీల ముద్దుల కూతురు ఇషా అంబానీ తమిళనాడు బ్రైడల్ స్టైల్లో మరింత అందంగా మెరిసిపోయింది. పింక్ బార్డర్, గోల్డెన్ బ్లౌజ్‌తో టీల్ రా సిల్క్ లెహంగా ధరించి హైలెట్ అయ్యింది.

అలాగే భారీ పచ్చలతో అలంకరించిన బంగారు హారం మరింత అట్రాక్షన్ అయ్యింది. ఈ గోల్డ్ హారం ఆమె రూపాన్ని మరింత హైలెట్ చేసింది. ఇక తమిళనాడు బ్రైడల్ సాంప్రదాయ హెయిర్ స్టైల్లో అద్భుతంగా కనిపించింది.

ఈ వేడుకలలో ఇషా అంబానీ జడ మరింత అందంగా కనిపించింది. పైన మొత్తం పువ్వుల మొగ్గలతో కొప్పు వేసి.. బ్రెయిడ్ మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్క్ చేశారు. చివర్లో జడ కుచ్చిళ్లు బంగారు సూర్యచంద్రుడిలా హైలెట్ చేశారు. ఇక చెవులకు కూడా గోల్డ్ స్టడ్స్ తో మరింత అందంగా కనిపించారు.

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయాన్స్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల ముద్దుల కుమార్తె ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరమల్‌తో జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.




