- Telugu News Photo Gallery Cinema photos NBK 109 Movie to Vettaiyan latest movie updates from film industry
Movie Updates: బులెట్ స్పీడ్ లో బాలయ్య.. వేట్టయాన్ కోసం ఫాహద్ ఫాజిల్..
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ పవర్‌హౌస్‌లాంటి వ్యక్తి అని అన్నారు శంకర్. రవి సిరోర్, నివిష్క పాటిల్ జంటగా నటించిన సినిమా 'ఎవరు ఎందుకు'. అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా బచ్చలమల్లి. రజనీకాంత్, అమితాబ్, రానా, మంజువారియర్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా వేట్టయాన్.
Updated on: Jul 11, 2024 | 3:40 PM

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే మొదలైన షెడ్యూల్ తాజాగా పూర్తయింది. బాలయ్యతో పాటు మిగిలిన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వారం రోజుల తర్వాత మరో షెడ్యూల్ మొదలుకానుంది. దాదాపు 15 రోజుల పాటు సాగుతుంది.

రామ్‌చరణ్ పవర్‌హౌస్‌లాంటి వ్యక్తి అని అన్నారు శంకర్. ఆయనలోని కంట్రోల్డ్ పవర్‌ని గేమ్ చేంజర్‌లో చూడొచ్చని చెప్పారు. చరణ్ పార్టు చిత్రీకరణ పూర్తయిందని అన్నారు. చరణ్‌లాంటి హీరోతో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు శంకర్. భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాలను చెప్పారు.

రవి సిరోర్, నివిష్క పాటిల్ జంటగా నటించిన సినిమా 'ఎవరు ఎందుకు'. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా 'ఎవరు ఎందుకు' సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్ర నిర్మాత వెంకటేష్‌రెడ్డి... హిందూపూర్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌గా తమకు ఎప్పటి నుంచో ఆప్తుడని అన్నారు శ్యామలాదేవి. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు తుమ్మల ప్రసన్నకుమార్.

అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా బచ్చలమల్లి. రాజేష్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. అమృత అయ్యర్ నాయిక. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. తాజాగా డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టింది టీమ్. రా అండ్ రస్టిక్ కథాంశంతో తెరకెక్కుతున్నట్టు చెప్పారు మేకర్స్.

రజనీకాంత్, అమితాబ్, రానా, మంజువారియర్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా వేట్టయాన్. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఫాహద్ ఫాజిల్ తన కేరక్టర్‌కి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. అక్టోబర్ 10న విడుదల కానుంది వేట్టయాన్. సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్లో మరో రేంజ్ సినిమా అవుతుందని అన్నారు మేకర్స్.



