Film News: బాక్స్ ఆఫీస్ కి చుక్కలు చూపిస్తున్న కల్కి.. మహేష్ ప్రశంస..

కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. కల్కి ఓ అద్భుతం. జస్ట్ వావ్‌ అనిపించిందని అన్నారు హీరో మహేష్‌.  గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం వల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని అన్నారు నటి హేమ. యంగ్ హీరో మంచు మనోజ్ తన కూతురి పేరును ప్రకటించారు.  తన యాబైవ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు హీరోయిన్ అంజలి.

Prudvi Battula

|

Updated on: Jul 11, 2024 | 4:04 PM

 కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 900 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు.

1 / 5
కల్కి ఓ అద్భుతం. జస్ట్ వావ్‌ అనిపించిందని అన్నారు హీరో మహేష్‌. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు సూపర్‌స్టార్‌. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండంలా ఉందని అన్నారు. అమితాబ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్ కి ఎవరూ సరితూగరని ప్రశంసించారు. కమల్‌హాసన్‌ ప్రతి పాత్రకూ జీవం పోస్తారని, ప్రభాస్‌ సునాయాసంగా నటించారని అన్నారు మహేష్‌.

2 / 5
గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం వల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని అన్నారు నటి హేమ. ఈ పరిస్థితుల్లో తనకు మా అండగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనపై కొందరు కావాలని చేస్తున్న దుర్మార్గమైన ప్రచారం వల్ల తాను అనేక ఇబ్బందులకు గురవుతున్నానని అన్నారు. ఈ సమయంలో మా రక్షించాలని, తనపై ఉన్న సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని కోరారు.

3 / 5
యంగ్ హీరో మంచు మనోజ్ తన కూతురి పేరును ప్రకటించారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన నామకరణ మహోత్సవంలో మనోజ్‌, మౌనికల పాపకు దేవసేన శోభా మంచు అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా తనకు అడంగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు మనోజ్‌.

4 / 5
తన యాబైవ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు హీరోయిన్ అంజలి. ప్రస్తుతం అశోక్ దర్శకత్వంలో ఈగై అనే సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్‌లో భాగంగా 16 అడుగుల ఎత్తు నుంచి దూకాల్సి ఉండటంతో, డూప్‌ లేకుండా తానే స్వయంగా ఆ జంప్ చేశారు అంజలి.

5 / 5
Follow us