- Telugu News Photo Gallery Cinema photos Independence day special These are the Special movies in tollywood telugu cinema news
Independence Day : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్ మూవీస్ ఇవే..
స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు యావత్ భారతావని సిద్ధమయ్యింది. బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను భారతమాత ఒడిలో చేర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ముందుగా గుర్తోచ్చే వారు గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి గురించి తెలిపే సినిమాల గురించి తెలుసుకుందామా.
Updated on: Aug 14, 2023 | 8:36 PM

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు యావత్ భారతావని సిద్ధమయ్యింది. బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను భారతమాత ఒడిలో చేర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ముందుగా గుర్తోచ్చే వారు గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి గురించి తెలిపే సినిమాల గురించి తెలుసుకుందామా.

అల్లురి సీతారామరాజు.. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్ర్యోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా రూపొందించారు. ఈ సినిమా అప్పట్లో 175 రోజులు విజయవంతంగా ప్రదర్శించారు.

మేజర్ చంద్రకాంత్.. సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 1993లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంలో ఉన్న సైనికుడి జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

భారతీయుడు.. తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని అందంగా తెరకెక్కించారు.

ఖడ్గం.. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. 2002లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

మహాత్మ.. డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో భావన కథానాయికగా నటించారు.

ఆర్ఆర్ఆర్.. ఇటీవల డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బ్రిటీష్ కాలంలో మన్యం వీరుడైన కొమురం భీం జీవితం ఆధారంగా తెరకెక్కించారు.