- Telugu News Photo Gallery Cinema photos IC 814 is Now the name is very famous and controversial too!
IC 814 Series: IC 814.. ఇప్పుడీ పేరు బాగా ఫేమస్.. అలాగే కాంట్రవర్సియల్ కూడా..!
IC 814 అనే ఒకే ఒక్క వెబ్ సిరీస్ ఇండియాను షేక్ చేస్తుంది.. అలాగే వివాదాలకు తెర తీస్తుంది. అసలు ఐసి 814 సిరీస్ చుట్టూ రేగిన వివాదమేంటి..? పాతికేళ్ళ కింద ఏం జరిగింది..? దాన్ని సిరీస్‌లో ఎలా వక్రీకరించారనే వాదనలు వినిపిస్తున్నాయి..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..?
Updated on: Sep 07, 2024 | 4:01 PM

1999లో భారత ప్రయాణికుల విమానం హైజాక్ కథాంశంగా తీసిన IC 814 వెబ్ సిరీస్‌లోని కొందరు తీవ్రవాదుల పాత్రలకు హిందూ పేర్లు పెట్టారనే నేపథ్యంలో వివాదం రాజుకుంటుంది.

ప్రముఖ ఓటిటి నెట్‌ఫ్లిక్‌లో ఆగస్ట్ 29న విడుదలైంది. అనుభవ్ సిన్హా ఈ సిరీస్‌కు దర్శకుడు. దీనిపై తమ తప్పు ఒప్పుకుని.. ఇంకోసారి ఇలాంటివి చేయమని చెప్పుకొచ్చారు సదరు ఓటిటి యాజమాన్యం.

1999లో కఠ్మాండూ నుంచి దిల్లీకి వస్తున్న విమానం తీవ్రవాదుల హైజాక్‌కు చేయడం జరిగింది. మొత్తం 7 రోజుల పాటు ఇది కొనసాగింది. ఇదే ఆధారంగా IC 814 హైజాక్ డ్రామా సిరీస్ సాగింది.

భారత ప్రభుత్వం, హైజాకర్ల మధ్య ఒప్పందం కుదరడంతో విమానంలోని ప్రయాణికులను క్షేమంగా విడుదల చేయించడం కోసం మసూద్ అజార్ సహా ముగ్గురు మిలిటెంట్లను భారత్ జైలు నుంచి విడిచిపెట్టింది. అయితే హైజాకర్ల పేర్లు భోళా, శంకర్ అని పెట్టడమే వివాదానికి తావిచ్చింది.

నిజానికి ఫ్లైట్‌లో హైజాకర్లు ఒకరినొకరు భోళా, శంకర్ అంటూ నిక్‌నేమ్స్‌తో పిలుచుకున్నారని అప్పటి ప్రయాణికులే తెలిపారు. కాందహార్ హైజాక్ నేపథ్యంలోనే అజయ్ దేవ్‌గన్, అభిషేక్ బచ్చన్ నటించిన జమీన్‌తో పాటు.. నాగార్జున గగనం సినిమాలు వచ్చాయి. ఈ రెండూ ఫిక్షనల్ కథలుగా వస్తే.. IC814 ఒరిజినల్ ఇన్సిడెంట్‌గా తెరకెక్కింది. మొత్తానికి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.




