- Telugu News Photo Gallery Cinema photos Hero Dulquer Salmaan complete Turn in Tollywood as a telugu hero with Lucky Baskhar Movie Telugu Heroes Photos
Dulquer Salmaan: తెలుగు ఇండస్ట్రీకి చేరువవుతున్న దుల్కర్ సల్మాన్.! కంప్లీట్ గా మారినట్టేనా..
ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫెరెంట్. పుట్టి పెరిగిన చోట కాకుండా.. తెలుగులో రప్ఫాడిస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈయన డేట్స్ ఇప్పుడు హాట్ కేక్ అయ్యాయి. పేరుకు మలయాళ హీరో అయినా.. ఫోకస్ అంతా టాలీవుడ్‌పైనే ఉంది. తాజాగా మరో తెలుగు సినిమాకు సైన్ చేసారు దుల్కర్. ఇంతకీ ఏంటా సినిమా..? మహానటి, సీతా రామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్.
Updated on: Jul 29, 2024 | 2:02 PM

ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫెరెంట్. పుట్టి పెరిగిన చోట కాకుండా.. తెలుగులో రప్ఫాడిస్తున్నారు దుల్కర్ సల్మాన్.

ఈయన డేట్స్ ఇప్పుడు హాట్ కేక్ అయ్యాయి. పేరుకు మలయాళ హీరో అయినా.. ఫోకస్ అంతా టాలీవుడ్‌పైనే ఉంది. తాజాగా మరో తెలుగు సినిమాకు సైన్ చేసారు దుల్కర్.

ఇంతకీ ఏంటా సినిమా..? మహానటి, సీతా రామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈయనతో స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీ పడుతున్నారు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు దుల్కర్. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకుడు.

ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. పైగా ఈయన ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపైనే ఉంది. లక్కీ భాస్కర్‌తో పాటు రానా నిర్మాతగా కాంతా అనే సినిమా చేస్తున్నారు.

సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకుడు. ఇది సెట్స్‌పై ఉండగానే.. తాజాగా గీతా ఆర్ట్స్ సినిమా సైన్ చేసారు దుల్కర్. సేనాపతి, దయా లాంటి ఓటిటి కంటెంట్‌తో ఆకట్టుకున్న పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార అనే సినిమాకు సైన్ చేసారు దుల్కర్ సల్మాన్.

గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా వస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మలయాళ మెగాస్టార్ వారసుడు.




