
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంతో మంది ఔత్సాహిక సింగర్లు ఈ రియాలిటీ షోలో పాల్గొని తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

ఈసారి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కు న్యాయనిర్ణేతలు థమన్, కార్తీక్, గీతా మాధురి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సమీరా భరద్వాజ్, శ్రీరామ చంద్ర హోస్టింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జెనీలియా దేశ్ ముఖ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఎప్పటిలాగే జడ్జీలు, హోస్ట్ లతో తన అల్లరి మాటలతో ఎంటర్ టైన్ చేసింది.

ప్రస్తుతం జెనీలియాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ సారి గల్లీ టు గ్లోబల్ కాన్సెప్టుతో తెలుగు ఇండియన్ ఐడల్ వచ్చేసింది. ఇందులో భాగంగా మొదట అమెరికాలో ఆ తర్వాత హైదరాబాద్ లో సింగింగ్ ఆడిషన్స్ నిర్వహించారు.