- Telugu News Photo Gallery Cinema photos Even with the peak of craze, those heroines are not getting any opportunities.
Heroines: క్రేజ్ పీక్స్.. అవకాశాలు మాత్రం నిల్.. ఎవరా హీరోయిన్స్.?
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చలామణి అవుతున్నవారిలో ఎక్కువ మంది కన్నడ, మలయాళ భామలే. ఒకటీ, అరా సినిమాలతోనే తెలుగు మాట్లాడటం నేర్చుకుని వరుసగా ఛాన్సులు కొట్టేస్తూ క్రేజ్ తెచ్చేసుకుంటారు. కొందరికి మాత్రం ఈ క్రేజ్ ఎంత ఉన్నా... చేతిలో అవకాశాలుండవు. ఇంతకీ మీరూ ఈ విషయాన్ని గమనించారా?
Updated on: May 14, 2025 | 3:00 PM

ఉంగరాల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ గర్ల్. వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. ఈ ఏడాది టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు చిత్ర పరిశ్రమలో గోల్డెన్ లెగ్ అంటూ పేరు తెచ్చుకొన్న క్రేజీ హీరోయిన్ సంయుక్త మీనన్ అయితే టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొంటుంది. బింబిసారా నుంచి విరూపాక్ష వరకు ఈమె నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాలు అందుకొన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేసింది.

అటు నయనతార, కీర్తీ సురేష్ అయితే మరో అడుగు ముందుకేశారు. నయన్ జవాన్ సినిమాతో హిందీలో బ్లక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు బేబీ జాన్ అంటూ ఓ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది కీర్తి.

ఇలా ఛాన్సులు కొట్టేసే వారు.. క్షణం తీరిక లేకుండా దూసుకుపోతుంటే, మరికొందరు మాత్రం ఉన్నపళాన వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఆ మధ్య బాలయ్య సినిమా వీరసింహారెడ్డితో ప్రేక్షకులను అలరించిన హనీరోజ్ ఆ తర్వాత వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఊసేలేదు...

ఇటు డబ్బింగ్ సినిమా ప్రేమలు హీరోయిన్‌కి కూడా చాన్సులకు కొదవే ఉండదనుకున్నారు. కానీ, దళపతి 69లో మాత్రం నటిస్తున్నారు మమిత బైజు. అంతకు మించి.. ఏవో ఒకటీ అరా తమిళ చిత్రాలున్నాయి అమ్మణి చేతిలో. టాలెంట్ ఉంటే సరిపోదు.. వచ్చిన పేరును, క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం కూడా కళే అంటున్నారు నెటిజన్లు.




