- Telugu News Photo Gallery Cinema photos Do you know about Kannada star KGF hero Yash Life style and Film Career telugu cinema news
KGF Star Yash: సూపర్ స్టార్ కావాలనే కోరిక..16 ఏళ్లకే రూ.300లతో ఇంట్లో నుంచి వచ్చేసిన యశ్.. ఎన్నో కష్టాలు ఎదుర్కోని..
పాన్ ఇండియా సినీ ప్రియులకు రాక్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కంటే రాకీ భాయ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా అభిమానులను సంపాదించుకున్నారు యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలు సెన్సెషన్ క్రియేట్ చేశాయి.
Updated on: Aug 13, 2023 | 5:58 PM

పాన్ ఇండియా సినీ ప్రియులకు రాక్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కంటే రాకీ భాయ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా అభిమానులను సంపాదించుకున్నారు యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలు సెన్సెషన్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాతో యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ హీరోగా తనను తాను నిరూపించుకోవడానికి ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు యశ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

యశ్ అసలు పేరు నవీన్, కర్ణాటకలోని హసన్ అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. యశ్ తల్లి తన కుమారుడి పేరు యశ్వంత్ ్ని మార్చుకున్నారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చాకా.. యశ్ గా పేరు మార్చుకున్నారు యశ్.

పాఠశాల రోజుల నుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉన్న యశ్. 16 ఏళ్ల వయసులో ఓ ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటానికి బెంగళూరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. కేవలం రూ.300 తీసుకుని.. బెంగుళూరు బయలుదేరాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశాలు దొరకకపోవడంతో థియేటర్ ట్రూప్ లో బ్యాక్ డాన్సర్ గా చేరాడు. అప్పుడు అతనికి రోజుకు రూ.50 చెల్లించేవారు. 2018లో 18 సంవత్సరాల వయసులో ఒక నాటకంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2005లో తన భార్య రాధిక పండిట్ తో కలిసి నంద గోకుల అనే సీరియల్లో నటించారు. ఆ తర్వాత 2007లో జంబాడ హుడుగి చిత్రంలో సహయ పాత్ర పోషించారు.

ఆ తర్వాత ఏడాది రాకీ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన యశ్.. చివరకు ప్రశాంత్ నీల్ కంటపడ్డాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన కేజీఎఫ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయడంతో యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.




