- Telugu News Photo Gallery Cinema photos Director Shankar and Ram Charan Game Changer movie may release in October say reports
Game changer: చెర్రీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ అప్ డేట్ వచ్చేసింది..
నిన్నటిదాకా వెయిట్ చేసిన రామ్‌చరణ్ ఫ్యాన్స్ కి త్వరలోనే మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారా? ఇంకెప్పుడు.. ఇంకా ఎప్పుడు అంటూ వెయిట్ చేసిన గేమ్ చేంజర్ రిలీజ్‌కి మంచి డేట్ దొరికేసిందా? ఆ డేట్‌తో తారక్ మూవీ దేవరకు, పవన్ కల్యాణ్ ఓజీకి లింకేంటి? సినిమా ఇండస్ట్రీలో ఆసక్తిగా వైరల్ అవుతున్న విషయాల గురించి మాట్లాడుకుందాం రండి...
Updated on: May 17, 2024 | 12:54 PM

పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్న శంకర్, ఆ వర్క్ ఇండియన్ 2 రిలీజ్, ప్రమోషన్ వర్క్ అంతా అయ్యాకే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. కొద్ది రోజులుగా గేమ్ చేంజర్‌ను పక్కన పెట్టి పూర్తిగా ఇండియన్ 2 వర్క్‌లోనే ఉన్నారు శంకర్.

దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయాలన్నది శంకర్ ప్లాన్. అయితే, ఆ షెడ్యూల్ ఇండియన్2 రిలీజ్‌కన్నా ముందే ఉంటుందా? తర్వాత ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

గేమ్ చేంజర్ విషయంలో మాత్రం షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా క్లారిటీ రావటం లేదు. లేటెస్ట్ స్టేట్మెంట్‌లోనూ త్వరలో రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తామని చెప్పిన శంకర్.. అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు.

ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను అక్టోబర్ 10న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా ప్రీ పోన్ అవుతుందనే వార్తలూ ఉన్నాయి. సెప్టెంబర్‌లోనే తారక్ సినిమా ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉందన్నది ఫిల్మీ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్. అందుకే అక్టోబర్‌లో గేమ్‌చేంజర్‌ని ప్లాన్ చేస్తున్నారన్నది టాక్.

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని ఇదివరకే అనౌన్స్ చేసింది టీమ్. అయితే ఇప్పుడు ఆ డేట్ మీదే దేవర ఫోకస్ చేశారా? లేకుంటే ఇంకో డేట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అనే చర్చ కూడా వినిపిస్తోంది. అఫిషియల్‌గా అనౌన్స్ మెంట్లు వచ్చేవరకు... ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయంటున్నారు క్రిటిక్స్.




