Salaar 2: ప్రశాంత్ నీల్‌కు నిద్ర లేకుండా చేస్తున్న ప్రభాస్

సలార్‌తో ప్రశాంత్ నీల్‌కు అసలు ఇబ్బందులు మొదలయ్యాయా..? ప్రభాస్‌కు ఆరేళ్ల తర్వాత మంచి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడిని పట్టుకుని అదేంటి అలా అంటారు అనుకోవచ్చు కానీ ప్రశాంత్‌కు అయితే ప్రస్తుతానికి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. దానికి కారణమేంటి.. సలార్‌తో ఆయనకు వచ్చిన ఇబ్బందేంటి.. అసలు తారక్ సినిమా పరిస్థితేంటి..? సలార్ సక్సెస్‌తో చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ ఫామ్‌లోకి వచ్చారేమో కానీ పాపం ప్రశాంత్ నీల్‌కు మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ వచ్చింది ఈ విజయంతో.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jan 20, 2024 | 1:45 PM

సలార్‌తో ప్రశాంత్ నీల్‌కు అసలు ఇబ్బందులు మొదలయ్యాయా..? ప్రభాస్‌కు ఆరేళ్ల తర్వాత మంచి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడిని పట్టుకుని అదేంటి అలా అంటారు అనుకోవచ్చు కానీ ప్రశాంత్‌కు అయితే ప్రస్తుతానికి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. దానికి కారణమేంటి.. సలార్‌తో ఆయనకు వచ్చిన ఇబ్బందేంటి.. అసలు తారక్ సినిమా పరిస్థితేంటి..?

1 / 5
సలార్ సక్సెస్‌తో చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ ఫామ్‌లోకి వచ్చారేమో కానీ పాపం ప్రశాంత్ నీల్‌కు మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ వచ్చింది ఈ విజయంతో. నిజానికి కేజియఫ్ చేస్తున్నపుడు ఆయనకు తర్వాతి ప్రాజెక్ట్‌పై ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే అప్పటికి ప్రశాంత్ ఎవరో అంతగా తెలియదు కాబట్టి.. కానీ ఇప్పుడలా కాదు.. నీల్ కోసం చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు.

2 / 5
ముందు సలార్‌ను ఒక్క పార్ట్‌లోనే చెప్పాలనుకున్నా.. కథలో స్కోప్ ఉండటంతో 2 పార్ట్స్ చేయాలని ఫిక్సైపోయారు. అనుకున్నట్లుగానే పార్ట్ 1 విడుదలవ్వడం.. 650 కోట్ల వరకు వసూలు చేయడంతో అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ వేడిలో ఉన్నపుడే సలార్ 2 పార్ట్ చేయాలా లేదంటే ముందుగా కమిటైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టాలా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు ప్రశాంత్ నీల్.

3 / 5
ప్రభాస్ కోసం ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ పక్కనబెడుతున్నారనే చర్చ జోరుగా జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో. దేవరతో బిజీగా ఉన్న తారక్.. ఆ తర్వాత వార్ 2 కూడా పూర్తి చేయాలి. ఈలోపు సలార్ 2 పూర్తిచేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ప్రశాంత్. పైగా ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాలు కూడా చివరి దశకు వచ్చేయడంతో.. ప్రభాస్ సైతం సలార్ 2 వైపు ఆసక్తిగా ఉన్నారు.

4 / 5
అలా కాకుండా ముందు తారక్ సినిమా చేస్తే.. అది పూర్తయ్యేలోపు ఇటు కల్కి, రాజా సాబ్, స్పిరిట్ పూర్తి చేస్తారు ప్రభాస్. కానీ సలార్ 2 పార్ట్స్ మధ్య ఇన్ని సినిమాలు వస్తే.. ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. బాహుబలి, కేజియఫ్, పుష్ప ఇవన్నీ వెంటవెంటనే వచ్చాయి. మరి సలార్‌కు భారీ గ్యాప్ తీసుకుంటారా లేదంటే ముందే పూర్తి చేస్తారా అనేది చూడాలిక.

5 / 5
Follow us